Oppo Reno 11: మార్కెట్ లోకి ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ గురించి తెలిస్తే వావ్ అనాల్సిందే?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సంస్థ మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వ
- By Anshu Published Date - 06:30 PM, Sun - 31 December 23

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సంస్థ మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది ఒప్పో సంస్థ. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ల లోనే వేరియేషన్లను కూడా విడుదల చేస్తోంది. కాగా ఒప్పో రెనో 11 సిరీస్ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను జనవరి 11వ తేదీన భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో అనే రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా కలర్ ఓఎస్ 14పై పనిచేస్తాయి. ఒప్పో రెనో 11 ఫోన్‌లో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4800 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ సొంతం. ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
ఒప్పో రెనో 11లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఒక ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ ఫోన్ సొంతం. ఇక రెనో 11 ప్రో విషయానికొస్తే ఇందులో.. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.74 అంగుళాల డిస్ ప్లేను అందించారు. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్‌తో పని చేస్తాయి. రెనో11 ప్రో ఫోన్ 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4700 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు.