Oppo K11 5G: మార్కెట్ లోకి ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల మంచి మంచి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇ
- By Anshu Published Date - 07:30 PM, Wed - 26 July 23

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల మంచి మంచి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన ఒప్పో సంస్థ తాజాగా మార్కెట్లోకి మరోసారి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఒప్పో కే11 పేరుతో కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫోన్ భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. మరి ఒప్పో కే11 స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ విషయానికి వస్తే..
ఒప్పో కే11 స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ 6ఎన్‌ఎం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జీ ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 100 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కూడా కలిగి ఉండనుంది. ఈ ఫోన్ 10 నిమిషాల్లో 50 శాతం, 26 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ మనకు 3 వేరియంట్ లలో లభిస్తోంది. కాగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 8 జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 21వేలుగా ఉంది. 12 జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 24 వేలు గా ఉంది.
అలాగే 12 జీబీ రామ్, 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 29,000గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే..ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10 సపోర్ట్, 240 హెర్ట్జ్ టచ్ శాంపింగ్ రేట్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఒప్పో కే 11 స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.