OnePlus Nord CE 3: మార్కెట్ లోకి వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసి
- By Anshu Published Date - 06:30 PM, Mon - 3 July 23

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి విడుదల అయ్యే స్మార్ట్ ఫోన్ ల కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడంతో పాటు మార్కెట్లోకి విడుదల అవ్వగానే ఇష్టపడి కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే వన్‌ప్లస్ సంస్థ కూడా మార్కెట్ ను మరింతగా విస్తరించుకునేందుకు గట్టిగానే కృషి చేస్తోంది. అయితే ఇప్పటికే మార్కెట్లోకి పదుల సంఖ్యలో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన వన్ ప్లస్ సంస్థమరో స్మార్ట్ఫోన్ ని విడుదల మార్కెట్ లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకురాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో మంచి ఫీచర్స్‌ను అందించనున్నారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.72 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్‌లో క్వాల్‌కం స్నాప్‌డ్రాన్ 782 ఎస్‌ఓపీ వంటి శక్తివంతమైన ప్రాసెసర్‌ను అందించారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌లో 256 జీబీ స్టోరేజ్‌తో పాటు 12 జీబీ వరకు ర్యామ్‌ను అందించనుంది. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, వైఫై, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 స్మార్ట్ ఫోన్‌లో 80 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. దీని ధర రూ. 25,000 నుంచి రూ. 28,000ల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.