Nokia X30 5G: భారత్ మార్కెట్ లోకి నోకియా ఎక్స్30 ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నోకియా సంస్థ వినియోగదారుల కోసం తాజాగా భారత మార్కెట్ లోకి నోకియా ఎక్స్ 30 5జీ అనే
- By Anshu Published Date - 07:30 AM, Fri - 17 February 23

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నోకియా సంస్థ వినియోగదారుల కోసం తాజాగా భారత మార్కెట్ లోకి నోకియా ఎక్స్ 30 5జీ అనే సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ ల విషయానికి వస్తే.. తాజాగా భారత మార్కెట్లో నోకియా ఫోన్ ధర రూ. 48,999 గా ఉంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ పై రానున్న రోజుల్లో ధర మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నోకియా ఎక్స్ 30 5జీ 50మెగాపిక్సెల్ ప్యూర్ వ్యూ కెమెరా ఈ ఫోన్లో ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఏఐ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని ఉపయోగిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పలు కెమెరాల కెపాసిటిని కూడా కలిగి ఉంది. ఫ్రంట్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉది.
ఈ స్మార్ట్‌ఫోన్ లో గోప్రో క్విక్ యూప్ ప్రీ ఇన్స్టాల్ అయి వస్తుంది. నోకియా యూజర్లు ఎక్కడి నుంచైనా ఫొటోలను తీసుకోవచ్చు. కాగా ఈ నోకియా ఎక్స్ 30 5జీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.43-అంగుళాల HD AMOLED డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ 700 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అడ్రెనో 619L జీపీయూతో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 8nm మొబైల్ ప్లాట్‌ఫారమ్ తో లభించనుంది. 8జీబీ LPDDR4x ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ ఆప్షన్ కూడా ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 పై రన్ అవుతుంది. f/1.8 ఎపర్చరుతో 50మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఓఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 13మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉంటుంది. నోకియా ఎక్స్ 30 5జీ ఫోన్ మనకు ఐస్ వైట్, క్లౌడీ బ్లూ రంగులలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. సింగిల్ 8జిబి, 256జిబివెర్షన్ కోసం రూ. 48,999 గా ఉంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన రిటైల్ అవుట్ లెట్ లలో ఫ్రీ బుకింగ్ మొదలు కాగా ఆన్లైన్ పోర్ట్ లలో ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం అవుతుంది.