Moto G04 Launch: అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన మోటో జీ04 ఫోన్.. ధర చాలా తక్కువ?
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇండియన్ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త
- By Nakshatra Published Date - 05:30 PM, Fri - 16 February 24
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇండియన్ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటుగా ఆల్రెడీ మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. మోటోరోలా స్మార్ట్ ఫోన్ పై భారీగా తగ్గింపుతో అతి తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొత్త కొత్త ఫోన్లను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేస్తోంది. తాజాగా మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జీ04 మోడల్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది.
ఐపీఎస్ ఎల్సీడీ పంచ్-హోల్ డిస్ప్లే 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతోంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. రూ. 6,249 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది. ఇకపోతే భారత్‌లో మోటో జీ04 ధర ఎంత అన్న విషయానికి వస్తే.. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు మోటో జీ04 సిరీస్‌ను కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ అనే నాలుగు కలర్స్ లలో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాక్రిలిక్ గ్లాస్ ఫినిషింగ్‌తో కూడిన మ్యాట్ షేప్ కలిగి ఉంటుంది. తద్వారా గీతలు పడవు. మోటో జీ04 ఫోన్ రెండు మెమరీ, స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కలిగి ఉంది.
ఈ ఫోన్ ధర వరుసగా రూ.6,249, రూ.7,999కు పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్సైట్, భారత మార్కెట్లోని ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఫిబ్రవరి 22, 2024 నుంచి మధ్యాహ్నం 12గంటలకు సేల్ ప్రారంభం కానుంది. మోటో జీ04 మోడల్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కెమెరా కటౌట్‌తో 6.6-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. వెలుతురును బట్టి ఫోన్ కలర్ ఎడ్జెస్ట్ అవుతుంది. సౌండ్ క్వాలిటీని అందించే డాల్బీ అట్మోస్ స్పీకర్‌ను కూడా కలిగి ఉంది. మోటో జీ04 ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. వినియోగదారులు తమ డివైజ్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు. సురక్షితంగా యాక్సెస్ చేసుకోగల ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఓఎస్ (OS)లో హెల్త్, సెక్యూరిటీ, డేటా కోసం ప్రైవసీ అప్డేట్స్ కూడా కలిగి ఉంది. మోటో జీ04 ఫోన్ 8జీబీ లేదా 4జీబీ ర్యామ్ కలిగి ఉంది. ర్యామ్ బూస్ట్ ఫీచర్‌తో 16జీబీ పెంచుకోవచ్చు. యూనిసోక్ టీ606 చిప్సెట్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ని కలిగి ఉంది. 64జీబీ లేదా 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. దీనిని మైక్రో ఎస్డీ కార్డ్‌తో 1టీబీకి విస్తరించవచ్చు. ఇందులో 3 సిమ్ కార్డులకు స్లాట్ కూడా ఉంది.
మోటో జీ04 ఫోన్ 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 15డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 16ఎంపీ బ్యాక్ కెమెరా, ఏఐని ఉపయోగించి 5ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. హెచ్డీఆర్, పోర్ట్రెయిట్ మోడ్, టైమ్‌లాప్స్, నైట్ విజన్, లెవెల్లర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
Related News
T20I Player Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో సూర్యకుమార్ యాదవ్..!
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ లో భారత పేలుడు బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.