HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Motorola India Launched Moto E22s Smartphone Under Rs 10000 In India Know Price

Motorola e22s: అతి తక్కువ ధరకే మోటోరోలా స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ధర, ఫిచర్లు?

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మోటోరోలా ఒక శుభవార్తను తెలిపింది. అతి తక్కువ బడ్జెట్లో అనగా రూ.10 వేలకు లోపు

  • Author : Anshu Date : 17-10-2022 - 6:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Motorola E22s
Motorola E22s

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మోటోరోలా ఒక శుభవార్తను తెలిపింది. అతి తక్కువ బడ్జెట్లో అనగా రూ.10 వేలకు లోపు స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలి అనుకున్న వారికి మోటోరోలా సంస్థ తాజాగా భారత మార్కెట్లోకి మరొక కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. రూ.10,000 లోపు సెగ్మెంట్లో మోటోరోలాఇ22ఎస్ మోడల్ ను లాంఛ్ చేసింది. డ్యూయెల్ కెమెరా సెటప్, 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ అద్భుతమైన ఫీచర్లతో ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ ని భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది మోటోరోలా.

ఇకపోతే ఇటీవల రూ.10 వేల బడ్జెట్‌లో మోటో ఇ32, మోటో ఇ32ఎస్ మోడల్స్ ని లంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ స్మార్ట్ ఫోన్లను కూడా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చిన మోటోరోలా తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ ఇంకాస్త తక్కువ ధరకు తీసుకువచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 22న సేల్ ప్రారంభం అవుతుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషను వివరాల విషయానికొస్తే..

4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ తో లభించనుంది. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. కాగా ఇందులో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా లభిస్తుంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మోటోరోలా ఇ22ఎస్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మోటోరోలా ఇ22ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Motorola
  • Motorola e22s
  • specifications

Related News

    Latest News

    • Hyundai : హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్

    • Mangos : మార్కెట్‌లో కల్తీ మామిడి పండ్లు..తెలుసుకోవడం ఎలా అంటే !!

    • Hyderabad : పెళ్లి ఎక్కడ జరగదో అనే భయం తో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

    • Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర..కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్ !!

    • Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

    Trending News

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

      • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

      • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

      • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

      • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd