Motorola Edge 40 Neo: మార్కెట్ లోకి మోటోరోలా సరికొత్త స్మార్ట్ ఫోన్.. విడుదల అయ్యేది అప్పుడే?
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోరోలా
- By Anshu Published Date - 02:22 PM, Sun - 17 September 23

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోరోలా సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. కాగా మోటోరోలా ఇటీవల వరుసగా బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్ లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లలో కొత్త కొత్త ఫీచర్ లను పరిచయం చేస్తోంది. ఇదే క్రమంలో మరో కొత్త ఫోన్ లాంచింగ్ కు రెడీ అయ్యింది.
మోటోరోలా ఎడ్జ్ 40 నీయో ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. కాగా ఈ మోడల్ ను ఏప్రిల్ లోనే పరిచయం చేశారు. మోటోరోల్ ఎడ్జ్ 40, మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో మోడళ్లను ఇంతకు ముందే మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే వాటితో పాటు ప్రకటించిన ఈ మోటోరోలా ఎడ్జ్ 40 నియోను మాత్రం మన దేశంలో విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ను సెప్టెంబర్ 21న ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. మరి మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ లు, ధర విషయానికొస్తే.. మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ లో 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది,144హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు.
ఇది మాలి జీ77 జీపీయూ, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 1050 ఎస్ఓసీ ద్వారా శక్తి పొందుతుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత మైయూఎక్స్ ఓఎస్ తో పనిచేస్తుంది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. ఎడ్జ్ 40 నియో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ముందు కెమెరా 32-మెగాపిక్సెల్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 68వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. భద్రత కోసం, హ్యాండ్‌సెట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‌తో వస్తుందని కూడా చెబుతున్నారు. డ్యుయల్ నానో సిమ్-సపోర్ట్ చేసే ఫోన్ 5జీ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, వైఫై, యూఎస్బీ టైప్-సి కనెక్టివిటీ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు కెనీల్ బే, బ్లాక్ బ్యూటీ, సూథింగ్ సీ వంటి కలర్స్ లో లభించనుంది.