Discount on Phone: అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే ఆకట్టుకుంటున్న స్మార్ట్ ఫోన్.. బారులు తీరిన కస్టమర్స్?
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యాలి అనుకుంటున్నా వారికి ప్రస్తుతం ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే న్యూ ఇయర్ సేల్స్ లో భాగంగా ప్రస్తుత
- Author : Anshu
Date : 05-01-2024 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యాలి అనుకుంటున్నా వారికి ప్రస్తుతం ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే న్యూ ఇయర్ సేల్స్ లో భాగంగా ప్రస్తుతం స్మార్ట్ఫోన్లను అతి తక్కువ ధరకే అందిస్తున్నాయి కొన్ని స్మార్ట్ ఫోన్ సంస్థలు. అలాగే త్వరలోనే సంక్రాంతి పండుగ కూడా రానుంది. ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే మోటరోలా కంపెని కూడా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే విక్రయిస్తున్నారు. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను MRP ధరలో సగం ధరతో ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ సెప్టెంబర్ 2022లో లాంచ్ అయ్యింది. అంటే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 50 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అందువల్ల, ఇప్పుడు వినియోగదారులు ఈ-కామర్స్ సైట్ నుంచి MRP ధర రూ.69,999కి బదులుగా రూ.34,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధర దగ్గర, వినియోగదారులు ఫోన్ యొక్క 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను పొందవచ్చు. ఫ్లాట్ 50 శాతం తగ్గింపుతో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లోని కస్టమర్లకు కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు కూడా లభిస్తున్నాయి. కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.20,300 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.
అయితే, గరిష్ట తగ్గింపు పొందడానికి, ఫోన్ మంచి స్థితిలో ఉండటం చాలా ముఖ్యం. ఇకపోతే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక భాగంలో 200ఎంపీ ప్రైమరీ కెమెరా అందుబాటులో ఉంది. మోటారోలా ఎడ్జ్ 30 అల్ట్రా బ్యాటరీ 4,610mAh, ఇది 125W TurboPower వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. అలాగే మొబైల్ ఫోన్ల పై ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి.