Xiaomi civi 3: మార్కెట్ లోకి ఎంఐ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్
- By Nakshatra Published Date - 05:25 PM, Thu - 25 May 23

దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని వందల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోకి విడుదల అయిన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను వినియోగదారుల కోసం మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి సదరు కంపెనీలు. ఇటీవల కాలంలో ఎటువంటి స్మార్ట్ ఫోన్ లను విడుదల అయినా కూడా ఆ ఫోన్ లలో డ్యూయల్ కెమెరా సెట్ అప్ తోనే వస్తున్నాయి.
కాగా తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన ఎంఐ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌తో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేయబోతుందని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఎంఐ సివీ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ ఫోన్‌ను కంపెనీ మే 25న అనగా నేడు చేస్తుందని తెలుస్తోంది. కాగా ఈ ఫోన్ మనకు కోనోమట్ గ్రే, మింట్ గ్రీన్, ఎడ్వంచర్ గోల్డ్ వంటి కలర్స్ లో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని లీక్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ ల్ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందులో 6.5 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 12 జీబీ+256 జీబీ వేరియంట్లో లభ్యం, ఎంఐయూఐ 14 ద్వారా ఆండ్రాయిడ్ 13తో వర్కింగ్, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. అలాగే 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 20 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో రౌండ్ ట్రిపుల్ కెమెరా సెటప్ 32 ఎంపీ+32 ఎంపీ కెమెరాలతో డ్యుయల్ ఫ్రంట్ కెమెరా తో లభ్యం కానుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో రానుంది.. అయితే ఈ తాజా ఫోన్ చైనా మార్కెట్ 25న లాంచ్ చేస్తుండగా భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారు అన్నది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Related News

Tecno Camon 20 Series: మార్కెట్ లోకి మరో టెక్నో స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ అదుర్స్?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో ఆయా స్మార్ట్ ఫోన్ తయార