ఇకపై వాట్సాప్‌లో కూడా సబ్‌స్క్రిప్షన్.. ధర ఎంతంటే?
ఇందులో ఏయే ఫీచర్లు ఉంటాయి? ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుంది? అనే విషయాలపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రాలేదు.
- Author : Gopichand
Date : 27-01-2026 - 8:38 IST
Published By : Hashtagu Telugu Desk
WhatsApp Subscription: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే త్వరలో మీరు వాట్సాప్ ఉపయోగించడానికి కూడా డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. వినియోగదారులకు ప్రకటనలు లేని అనుభవాన్ని అందించడానికి కంపెనీ ఒక కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై పని చేస్తోంది. అంటే మీ వాట్సాప్ స్టేటస్‌లు, ఛానెల్స్‌లో ప్రకటనలు కనిపించకూడదని మీరు అనుకుంటే మీరు పెయిడ్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్ గురించి ప్రస్తుతం పూర్తి సమాచారం అందుబాటులో లేనప్పటికీ దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రకటనలను తొలగించడమేనని తెలుస్తోంది. వాట్సాప్‌లో గత ఏడాది నుండే ప్రకటనలు చూపించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారిన జనసేన ఎమ్మెల్యే ! లైంగిక వేధింపుల ఆరోపణలతో వైరల్ !!
సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర ఎంత ఉంటుంది?
ఇందులో ఏయే ఫీచర్లు ఉంటాయి? ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుంది? అనే విషయాలపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రాలేదు. అయితే నివేదికల ప్రకారం.. ఈ ప్లాన్ కేవలం ప్రకటనలను తొలగించడంపైనే దృష్టి పెడుతుంది తప్ప ఇందులో ఎటువంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం లేదు. అలాగే ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా లేదా అనేది కూడా స్పష్టంగా తెలియదు. గతంలో మెటా సంస్థ యూరోపియన్ యూనియన్ ఒత్తిడి కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల కోసం కొన్ని ప్రాంతాల్లో యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వాట్సాప్ ఈ ప్లాన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి తెస్తుందా లేదా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలకే పరిమితం చేస్తుందా అన్నది వేచి చూడాలి.
గత ఏడాది నుంచే ప్రకటనలు ప్రారంభం
మెటా సంస్థ గత ఏడాది నుండే వాట్సాప్ స్టేటస్, ఛానెల్స్‌లో ప్రకటనలు చూపించడం ప్రారంభించింది. ఈ నిర్ణయంపై అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అప్పటివరకు ఎటువంటి ప్రకటనలు లేకుండా వాట్సాప్‌ను వాడుతున్న వినియోగదారులు ఈ మార్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ మెటా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
ఇప్పుడు ప్రకటనలు లేని అనుభవం కావాలనుకునే వారి నుండి డబ్బులు వసూలు చేసేలా కంపెనీ కొత్త ప్లాన్ సిద్ధం చేస్తోంది. వాట్సాప్ వెర్షన్ 2.26.3.9 యాప్ కోడ్‌లో కొత్త స్ట్రింగ్స్ కనిపించడంతో కంపెనీ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై పని చేస్తోందనే వార్తలు ఊపందుకున్నాయి.