Jio Down: దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో డౌన్
భారతదేశంలోని అగ్రశ్రేణి టెలికాం ఆపరేటర్లలో ఒకటిగా పరిగణించబడుతున్న జియో మంగళవారం అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కాల్స్ మరియు ఇంటర్నెట్‌ను ఉపయోగించలేకపోయారు
- Author : Praveen Aluthuru
Date : 18-06-2024 - 4:17 IST
Published By : Hashtagu Telugu Desk
Jio Down: భారతదేశంలోని అగ్రశ్రేణి టెలికాం ఆపరేటర్లలో ఒకటిగా పరిగణించబడుతున్న జియో మంగళవారం అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కాల్స్ మరియు ఇంటర్నెట్‌ను ఉపయోగించలేకపోయారు. దీంతో 2,400 కంటే ఎక్కువ మంది వినియోగదారులు తమ జియో కనెక్షన్‌లలో సమస్యలను ఎదుర్కొంటున్నారని కంప్లైంట్ చేశారు.
మధ్యాహ్నం 1:53 గంటలకు ఈ సమస్యలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, కాలింగ్ మరియు ఇంటర్నెట్ సదుపాయం కోసం జియోపై ఆధారపడే వినియోగదారులకు ఇది చాలా ఇబ్బందిని కలిగించిందని వినియోగదారు నివేదికలు చూపించాయి. నివేదించబడిన సమస్యలలో దాదాపు సగం (48%) కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ జియో ఫైబర్ కి సంబంధించినవే. మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించిన సమస్యలు 47%తో రెండో స్థానంలో నిలిచాయి. మిగిలిన 5% వినియోగదారులు కోర్ మొబైల్ నెట్‌వర్క్.
ప్రస్తుతానికి అంతరాయానికి కారణానికి సంబంధించి జియో సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. అయితే సమస్యను పరిష్కరించి తక్షణమే సేవలను పునరుద్ధరించేందుకు సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు కృషి చేస్తున్నారని భావిస్తున్నారు.
Also Read: NEET Paper Leakage : 24 లక్షల మంది విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి – బల్మూరి వెంకట్