HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Isro To Launch Sslv On Aug 7 All About Indias Smallest Launch Vehicle

Isro@Aug7: 750 మంది విద్యార్థినులు ఆవిష్కరించిన ఉపగ్రహం.. ఆగస్టు 7న ఎస్‌ఎస్‌ఎల్‌వీ ద్వారా నింగిలోకి

చిన్న తరహా ఉపగ్రహాల ప్రయోగాలకు భవిష్యత్ లో చాలా డిమాండ్ ఉంటుంది.

  • By Hashtag U Published Date - 08:30 AM, Wed - 3 August 22
  • daily-hunt
Sslv Imresizer
Sslv Imresizer

చిన్న తరహా ఉపగ్రహాల ప్రయోగాలకు భవిష్యత్ లో చాలా డిమాండ్ ఉంటుంది. ఎన్నో స్వదేశీ, విదేశీ సంస్థలు తాము అభివృద్ధి చేయించుకున్న చిన్నపాటి ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది.ఈ వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఇస్రో సమాయత్తమైంది.

చిన్న తరహా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఇస్రో అభివృద్ధి చేసింది. దీన్ని ఈనెల 7వ తేదీ ఉదయం 9.18 గంటలకు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా 142 కిలోల భూ పరిశీలన ఉపగ్రహం మైక్రోశాట్‌-2ఎను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది గ్రామీణ బాలికలు రూపొందించిన 8 కిలోల ఆజాదీశాట్‌ను కూడా ఎస్‌ఎస్‌ఎల్‌వీ ద్వారా రోదసీలోకి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఈనెల 7న ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతి ఇస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఆసక్తి ఉన్నవారు ఎల్‌వీజీ.ఎస్‌హెచ్‌ఎఆర్‌.జీవోవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.  ఈ ప్రయోగ వీక్షణకు వచ్చేవారు కొవిడ్‌ టీకా రెండు డోసులు వేసుకున్నట్లు ధృవీకరణపత్రం కానీ, లేదా కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ గానీ తప్పని సరిగా తీసుకురావాలని నిబంధన విధించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India's smallest launch vehicle
  • isro
  • Small Satellite Launch Vehicles

Related News

    Latest News

    • Hyderabad : ‘గేట్ ఆఫ్ వరల్డ్’ స్థాయికి హైదరాబాద్ ను తీసుకెళ్తామ్ – సీఎం రేవంత్

    • Jobs in ECIL : ECILలో 160 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

    • Safety of Women : మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి – పవన్

    • Modi Birthday : 76వ వసంతంలోకి ప్రధాని మోదీ

    • CBN : పలు శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

    Trending News

      • Team India New Sponsor: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్స‌ర్ ఇదే.. డీల్ ఎంతంటే?

      • ITR Filing Due Date: ఐటీఆర్ ఫైల్ చేయ‌నివారికి మ‌రో ఛాన్స్‌.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

      • New GST Rate: గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గిన పాలు, నెయ్యి ధ‌ర‌లు!

      • Beggars Homes: బెగ్గర్స్‌ హోమ్స్‌ జైళ్ల కంటే దారుణం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

      • Cash Withdrawals: గుడ్ న్యూస్‌.. యూపీఐ ద్వారా డ‌బ్బు విత్‌డ్రా..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd