HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Instant Shocks For Lascivient Men Special Shoes For Womens Safety Polytechnic Students Creativity

Powerful Shoes : కామాంధులకు షాకిచ్చే ‘పవర్’ఫుల్ షూస్.. మహిళలకు సేఫ్టీ

ఈ షూస్‌ను ధరించిన మహిళలు/బాలికలు ఆపదలో ఉన్నప్పుడు మడమను బలంగా నేలకు రాయగానే అసలు కథ(Powerful Shoes) మొదలైపోతుంది.

  • By Pasha Published Date - 02:26 PM, Tue - 4 February 25
  • daily-hunt
Powerful Shoes Women Safety Shoes Polytechnic Student Alwar Rajasthan

Powerful Shoes : మహిళలు/బాలికల భద్రత కోసం ‘పవర్’ ఫుల్ షూస్ వచ్చేశాయి.  వీటిని రాజస్థాన్‌‌లోని అల్వార్ జిల్లా లిలీ గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ స్టూడెంట్ వివేక్ చౌదరి తయారు చేశాడు. ఈ షూస్ ధరించిన మహిళలు/బాలికల జోలికి ఎవరైతే వెళితే కరెంటు షాకులు తగలడం ఖాయం. ఎందుకంటే.. ఈ షూస్‌ను ధరించిన మహిళలు/బాలికలు ఆపదలో ఉన్నప్పుడు మడమను బలంగా నేలకు రాయగానే అసలు కథ(Powerful Shoes) మొదలైపోతుంది. వారిని తాకిన వారికి షాకుల మీద షాకులు తగులుతాయి. గరిష్ఠంగా 1000 షాకులను వరుస పెట్టి తగిలించే కెపాసిటీ ఈ షూస్‌కు ఉంది.  ఈ బూట్లలో జీపీఎస్ మోడల్, ఐసీ, పవర్ మాడ్యులేటర్, వోల్టేజ్ బూస్టర్ వంటి అనేక పరికరాలు ఉన్నాయి.  ఈ షూస్‌లోని ఓ డివైజ్‌కు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 1000 షాకులు కంటిన్యూగా ఇవ్వగలదు.  ఇందులోనే ఉండే ఒక ప్రత్యేక ఐసీలో మూడు ఫోన్ నంబర్లను మహిళలు/బాలికలు ఫీడ్ చేయొచ్చు. ఆపదలో ఉన్నప్పుడు.. షూస్‌లోని మడమ భాగాన్ని నేలకు రాయగానే ఆ మూడు ఫోన్ నంబర్లకు మెసేజ్ వెళ్తుంది. ఆపదలో ఉన్నారనే సందేశంతో పాటు లొకేషన్ వివరాలు ఆ సందేశంలో ఉంటాయి.

Also Read :Cricketers Tax Strategy : తెలివైన పన్ను వ్యూహాలతో భారత క్రికెటర్ల తడాఖా

అందరూ నవ్వినా పట్టించుకోని వివేక్ చౌదరి

  • వివేక్ చౌదరి పాలిటెక్నిక్ (ఎలక్ట్రికల్) మూడో సంవత్సరం విద్యార్థి.
  • ఓ వైపు చదువుతూనే.. మరోవైపు ఒక ప్రైవేట్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు.
  • అల్వార్ నగరంలోని మోతీ నగర్‌లో తన కుటుంబంతో వివేక్ నివసిస్తున్నాడు.
  • ఏడాది క్రితం అల్వార్ జిల్లా పరిధిలో మహిళలపై పలు నేర ఘటనలు జరిగాయి. వాటి గురించి న్యూస్‌లో చూసి వివేక్ చౌదరి బాధపడ్డాడు.  మహిళల భద్రత కోసం ఏదైనా చేయాలనుకున్నాడు.
  • ఈవిషయాన్ని కొందరు స్నేహితులకు వివేక్ చెబితే.. వాళ్లు నవ్వి వెళ్లిపోయారు.
  • దీంతో మహిళల భద్రత కోసం ప్రత్యేక షూస్ తయారీ ప్రక్రియను ఒంటరిగానే మొదలుపెట్టాడు.
  • ఇంటర్నెట్, యూట్యూబ్ చూసి టెక్నికల్ వివరాలన్నీ సేకరించాడు. వాటి ఆధారంగానే మహిళల భద్రత కోసం స్పెషల్ షూస్‌ రెడీ చేశాడు.
  • తాను తయారు చేసిన షూలకు మహిళల భద్రతా షూస్ (WSS) అని వివేక్ పేరు పెట్టాడు.
  • ఈ షూస్ తయారీ కోసం వివేక్ దాదాపు రూ.3,500 ఖర్చు చేశాడు.
  • త్వరలోనే ఈ బూట్లను వైర్‌లెస్ పద్ధతిలో ఛార్జింగ్ చేసే పద్దతిని అందుబాటులోకి తెస్తానని వివేక్ చెప్పాడు.

Also Read :TVS Jupiter CNG: TVS జూపిటర్ సీఎన్‌జీ ఈ నెలలో లాంచ్.. ధ‌ర ఇదేనా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alwar
  • crime
  • LASCIVIENT Men
  • Polytechnic Student
  • Powerful Shoes
  • rajasthan
  • Special Shoes For Women
  • Women Safety Shoes

Related News

    Latest News

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

    • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

    • ‎Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd