Infinix Zero 30: మార్కెట్ లోకి మరో కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. రోజురోజుకీ ఇన
- By Anshu Published Date - 07:19 PM, Thu - 7 September 23

ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. రోజురోజుకీ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆ కంపెనీ కూడా అతి తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఇన్‌ఫినిక్స్ జీరో 30 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింdదిఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన తొలి సేల్ సెప్టెంబర్ 8వ అనగా రేపటి నుంచి ప్రారంభం కానుంది.
కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు రెండు వేరియంట్స్‌లో లభించనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999 కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. లాంచింగ్ ఆఫర్ కింద పలు బ్యాంక్‌ల కార్డులపై డిస్కౌంట్ అందించనున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 2,400×1,080 పిక్సెల్‌తో కూడిన కర్వ్డ్ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను ప్రత్యేకంగా అందించారు.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.