Smartphone Camera: స్మార్ట్ ఫోన్ కెమెరా విషయంలో అలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ఫోటోలు తీసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమంటున్నారు టెక్ నిపుణులు.
- By Anshu Published Date - 11:30 AM, Fri - 29 November 24

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కాగా ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది కెమెరా పైన ఫోకస్ చేస్తున్నారు. బెస్ట్ కెమెరా కలిగిన ఫోన్స్ ని ఎక్కువ గా ఇష్టపడుతున్నారు. అయితే కెమెరాలో మొబైల్ ఫోన్ కొత్తగా కొన్నప్పుడు బాగానే ఉంటాయి రాను రాను మొబైల్ ఫోన్లో ఫొటోస్ సరిగా రావు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఫోటోలు తీసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
అద్భుతమైన ఫోటోలను తీయడానికి, ఫోన్ కెమెరా లెన్స్ శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యమట. సరిగ్గా శుభ్రం చేస్తే కెమెరా పాడైపోవచ్చు లేదా దాని నాణ్యత ప్రభావితం కావచ్చని చెబుతున్నారు. కాగా ఫోన్ కెమెరా లెన్స్ చాలా సున్నితంగా ఉంటుంది. దీన్ని శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ కేవలం మైక్రోఫైబర్ క్లాత్ ను మాత్రమే ఉపయోగించాలి. ఇది లెన్స్ ను శుభ్రపరచడమే కాకుండా గీతలు పడకుండా కూడా కాపాడుతుంది. లెన్స్ పై గీతలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఇతర క్లాత్‌ను ఉపయోగించకూడదని చెబుతున్నారు. అలాగే క్లాత్‌తో శుభ్రపరిచేటప్పుడు లెన్స్‌ను సున్నితంగా శుభ్రం చేయాలి. ఎక్కువ ఒత్తిడి చేసినట్లయితే లెన్స్ చెడిపోయే అవకాశం ఉంది.
లేదా కెమెరాపై ఉండే పూత దెబ్బతింటుంది. అలాగే కెమెరా లెన్స్ ను శుభ్రం చేయడానికి చాలా మంది సాధారణ నీటిని లేదా ఏదైనా రకమైన ద్రవాన్ని ఉపయోగిస్తారు. ఇది లెన్స్ కు హానికరం. మీరు లిక్విడ్ క్లీనర్ ను ఉపయోగించాల్సి వస్తే, ఎలక్ట్రానిక్ డివైజ్ క్లీనర్ లేదా లెన్స్ క్లీనర్ ను మాత్రమే ఉపయోగించాలనీ చెబుతున్నారు. చాలా సార్లు మనకు తెలియకుండానే వేళ్లతో లెన్స్‌ని తాకుతాము. అయితే ఇలా చేయడం వల్ల లెన్స్ పై ఆయిల్, డస్ట్ పేరుకుపోయి ఫోటో నాణ్యతను పాడు చేస్తుందట. అలాగే లెన్స్ పై దుమ్ము పేరుకుపోయినట్లయితే దానిని శుభ్రం చేయడానికి ఎయిర్ బ్లోవర్ ని ఉపయోగించాలట. ఊదడం ద్వారా దానిని శుభ్రం చేయడానికి ప్రయత్నించవద్దు. ఇది లెన్స్‌పై తేమను కలిగిస్తుందట. మీ ఫోన్ కెమెరాను శుభ్రపరిచేటప్పుడు ఈ జాగ్రత్తలను అనుసరించాలి. ఇలా చేయడం వల్ల మీ కెమెరా చాలా కాలం పాటు సురక్షితంగా, ప్రభావవంతంగా ఉంటుంది. మంచి ఫోటోను క్యాప్చర్ చేయడానికి కెమెరా శుభ్రంగా, సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం.