HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Honor Magic 6 Pro Leaked Price Honor Magic 6 Series Release On January 11

Honor Magic 6 Pro: త్వరలోనే మార్కెట్ లోకి హానర్ స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే?

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాట

  • By Anshu Published Date - 04:00 PM, Thu - 4 January 24
  • daily-hunt
Mixcollage 04 Jan 2024 03 05 Pm 7504
Mixcollage 04 Jan 2024 03 05 Pm 7504

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది హానర్ సంస్థ. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేయబోతోంది. హానర్ విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్స్‌ హానర్ మ్యాజిక్ 6 సిరీస్‌లో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే కంపెనీ ఈ సిరీస్‌ మొబైల్స్‌కి సంబంధించిన విడుదల తేదిని కూడా అధికారికంగా ప్రకటించింది. కంపెనీ జనవరి 10 నుంచి జనవరి 11 వరకు చైనాలో జరిగే రెండు రోజుల ఈవెంట్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ ను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఈవెంట్‌లో భాగంగా హానర్ మ్యాజిక్ 6, హానర్ మ్యాజిక్ 6 పోర్షే డిజైన్, హానర్ మ్యాజిక్ 6 ప్రో అనే మూడు మోడల్స్‌ మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే చైనాలో ప్రీబుకింగ్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ హానర్ మ్యాజిక్ 6 సిరీస్‌లు విడుదలకు ముందే కంపెనీ డిజిటల్ చాటింగ్ స్టేషన్ Weiboలో కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. కాగా ఈ ఫోన్ మనకు గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఇకపోతే ఈ బ్యాక్‌ ప్యానెల్‌ విషయానికొస్తే.. ఇంతముందు ఎప్పుడు చూడని ఫినిషింగ్‌తో రాబోతోంది. దీంతో పాటు త్రిభుజాకార రూపంలో త్రిపుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు LED ఫ్లాష్‌ కూడా అందుబాటులో ఉంది. కుడి వైపున వాల్యూమ్, పవర్ బటన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఇక ముందు భాగంలో రెండు సెల్ఫీకెమెరాలకు పిల్ ఆకారపు కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఇక Honor Magic 6 Pro స్మార్ట్ ఫోన్‌ విషయానికొస్తే.. ఇంతక ముందు కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో ఎలాగైతే ఫీచర్స్‌తో వెల్లడించిందో అవే స్పెషిఫికేషన్స్‌, ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ టీజర్‌లో కంపెనీ డ్యూయల్-LED ఫ్లాష్, మైక్రోఫోన్, 100x జూమ్‌తో కూడిన కెమెరా వంటి ఫీచర్స్‌ను పేర్కొంది. దీంతో పాలు ఈ మొబైల్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ కోసం MagicOS 8తో రాబోతోంది. 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..ఈ స్మార్ట్‌ ఫోన్‌ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రాబోతోంది. ఈ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ ఫ్రెంట్‌ లుక్‌ విషయానికొస్తే.. ఈ మొబైల్ 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ (ToF) 3D కెమెరాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది క్విక్‌ ఫేస్ అన్‌లాకింగ్‌ కోసం ఎంతగానో సహాయపడుతుంది. ఈ సిరీస్‌ ధర విషయానికొస్తే..రూ.111,990 తో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ఇతర వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • Honor Magic 6 Pro
  • Honor Magic 6 Pro smart phone
  • price

Related News

    Latest News

    • Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో కోట్లలో మోసం..చిక్కుల్లో విడదల రజని

    • PM Kisan : రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ

    • Karthika Masam: కార్తీక మాసం ఎఫెక్ట్ తో ఆలయాల్లో రద్దీ..భక్తులు జాగ్రత్త

    • Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!

    • Mobile Plans Prices: డిసెంబర్ 1 నుంచి మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

    Trending News

      • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

      • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

      • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

      • Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

      • Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd