HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Technology
  • ⁄Honda Launches Its New 100cc Bike At Rs 64900 Check Specs And Features

Honda Shine 100: మార్కెట్ లోకి మరో సరికొత్త హోండా బైక్ విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే?

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైకులను విడుదల చేసిన విషయం

  • By Nakshatra Published Date - 07:35 AM, Fri - 17 March 23
Honda Shine 100: మార్కెట్ లోకి మరో సరికొత్త హోండా బైక్ విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే?

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త బైకులను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే హోండా సంస్థ మార్కెట్ లోకి మరో హోండా బైక్ ని విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా హోండా కంపెనీ షైన్ 100సీసీని మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ బైక్ ధర, ఫీచర్స్ విషయానికి వస్తే.. హోండా కంపెనీ గ్రామీణ వినియోగదారులే లక్ష్యంగా ఈ కొత్త బైక్ ని లాంచ్ చేసింది. హోండా షైన్ 100 బైక్ పనితీరు దాదాపుగా హీరో స్ల్పెండర్‌ ప్లస్‌ మాదిరే ఉంటుంది. ఈ బైక్ 97.2 cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ద్వారా శక్తిని ఇస్తుంది. ఈ బైక్ 7.5 Bhpతో 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా షైన్ 100, 4 స్పీడ్ గేర్‌ బాక్స్‌తో వస్తుంది. కాగా హోండా కొత్త బైక్ ప్రధానంగా స్ల్పెండర్‌ కు పోటీగానే మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. మన దేశంలో 33% మోటార్‌సైకిల్ విక్రయాలు 100సీసీ సెగ్మెంట్‌లో నమోదవుతూ ఉంటాయి. హీరో స్ప్లెండర్ ఈ సెగ్మెంట్‌లో దాదాపు 2,50,000 యూనిట్ల నెలవారీ విక్రయాలతో టాప్ సెల్లింగ్ బైక్‌గా రాణిస్తోంది. కస్టమర్లు హోండా షైన్ 100 బైక్‌ను అథారైజ్డ్‌ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. హోండా షైన్ 100 తయారీ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. డెలివరీలు 2023, మే నెలలో ప్రారంభమవుతాయి. ఈ ఆల్ న్యూ బైక్ బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్ వంటి ఐదు కలర్స్ లో లభించనుంది. ఈ బైక్ లీటర్‌కి 65 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వనుంది.

ఇకపోతే ఈ బైక ఫీచర్లు విషయానికి వస్తే.. హోండా షైన్ 100 స్పెషల్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, నారో లెగ్ ఓపెనింగ్ యాంగిల్‌తో తేలికైన, మన్నికైన స్టీల్ ఫ్రేమ్‌తో లాంచ్ అయింది. ఇందులో ఆల్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం గ్రాబ్ రైల్, ఇంజన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్, కాంబి బ్రేక్ సిస్టమ్ సైతం అందించారు. దీని సస్పెన్షన్ సెటప్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ పవర్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఫ్రంట్ కౌల్, బోల్డ్ టెయిల్ ల్యాంప్, మఫ్లర్‌తో ఉన్న దీని స్టైలింగ్ షైన్ 125 బైక్‌ను పోలి ఉంది. ఈ కొత్త బైక్ సీటు పొడవు 677 మిమీ కాగా సీటు ఎత్తు 786 మిమీ. ఇది 1245 ఎంఎం వీల్‌బేస్, 168 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 1.9 మీటర్ల టర్నింగ్ రేడియస్‌తో వస్తుంది. ఇకపోతే ఈ బైక్ ధర విషయానికి వస్తే.. ఈ బైక్స్ మనకు రూ.64,900 గ్స్ ఉంది..

Telegram Channel

Tags  

  • features
  • Honda Shine 100
  • Honda Shine 100 cc
  • Honda Shine 100 cc bike
  • price
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

OnePlus: మార్కెట్ లోకి మరో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

OnePlus: మార్కెట్ లోకి మరో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం

  • Foldable Motorcycle: మార్కెట్లోకి బుల్లి ఎలక్ట్రిక్ స్కూటర్.. మడత పెట్టి కారు డిక్కీలో పెట్టేయవచ్చు?

    Foldable Motorcycle: మార్కెట్లోకి బుల్లి ఎలక్ట్రిక్ స్కూటర్.. మడత పెట్టి కారు డిక్కీలో పెట్టేయవచ్చు?

  • Ramayanam: రామాయణం విశేషాలు

    Ramayanam: రామాయణం విశేషాలు

  • Vishnu Matsya Avatara: మత్స్య జయంతి, విష్ణువు మత్స్యావతార విశేషాలు

    Vishnu Matsya Avatara: మత్స్య జయంతి, విష్ణువు మత్స్యావతార విశేషాలు

  • Itel P40: మార్కెట్ లోకి రూ.7 వేలకే సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?

    Itel P40: మార్కెట్ లోకి రూ.7 వేలకే సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?

Latest News

  • Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధర క్షీణత.. నేటి ధరలివే..!

  • North Korea Lockdown: ఉత్తర కొరియాలో లాక్ డౌన్.. కరోనా కారణం కాదు.. కానీ..!

  • No Confidence Motion: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..?

  • Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 4.3 తీవ్రతగా నమోదు

  • 39 Killed: విషాద ఘటన.. మెక్సికోలో 39 మంది సజీవదహనం

Trending

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

    • Pan – Aadhaar Link: పాన్ కార్డు, ఆధార్ లింకు చేసేందుకు గడువు మరో 3 నెలలు పొడిగింపు.. చివరితేదీ ఎప్పుడంటే..?

    • Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..

    • Surya Namaskar by the Leopard: సూర్య నమస్కారాలు చేసే చిరుతను చూసారా..!

    • Business Idea: ఇల్లు కదలకుండా డబ్బు సంపాదించే చాన్స్…ఏ పని చేయకుండానే నెలకు లక్షల్లో ఆదాయం…

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: