Ira: మార్కెట్ లోకి స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తక్కువ, ఫీచర్స్ ఇవే?
దేశ వ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు
- By Nakshatra Published Date - 07:30 AM, Tue - 21 February 23
దేశ వ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాహన వినియోదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో వాహనానికి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయా కంపెనీలు మంచి మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మార్కెట్లోకి ఐరా పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అయింది.అద్భుతమైన లుక్ తో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 230 వాట్ మోటార్ ఉంటుంది. స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 90 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్టంగా ఈ స్కూటర్ ఇద్దరిని మాత్రమే లాగగలదు. స్వల్ప దూరపు ప్రయాణాలకు మాత్రమే ఈ స్కూటర్ అనువుగా ఉంటుంది. ఎక్కువ దూరం అలాగే ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి అనుకున్న వారికి ఈ స్కూటర్ అసలు సెట్ కాదు. డిజిటల్ స్పీడో మీటర్ ఇందులో ఉంది. అయితే చూడటానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సూపర్ డిజైన్‌తో ఉంది. రెడ్, ఎల్లో వంటి రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోంది. ఈ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు నేరుగా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు.
కంపెనీ కేవలం ఈ మోడల్‌ను మాత్రమే కాకుండా ఇతర మోడళ్లను కూడా అందిస్తోంది. ఇంకో మూడు మోడళ్లను ఈ కంపెనీ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. దక్ష, నిర్బర్, విజయ్ 2000 అనే మోడళ్లను కూడా విక్రయిస్తోంది. ఇకపోతే ఈ ఐరా అ నే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 76,750 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ స్కూటర్ బ్యాటరీ ఫుల్ కావడానికి 4 నుంచి ఐదు గంటలు పడుతుంది. స్కూటర్లో డిజిటల్ ట్రిప్ మీటర్, పుష్ బటన్ స్టార్ట్, ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్, ముందు వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్స్, అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Related News
Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాలకు కలిసిరాని ఏప్రిల్..! భారీగా తగ్గిన విక్రయాలు..!
ఈ ఏడాది మార్చి నెలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలకు మంచి సమయం లభించింది.