Google Pay UPI LITE : పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్.. గూగుల్ పేలో “యూపీఐ లైట్” ఫీచర్
Google Pay UPI LITE : Google Pay తమ ప్లాట్ఫామ్లో UPI లైట్‌ని విడుదల చేసింది.
- By Pasha Published Date - 12:19 PM, Fri - 14 July 23
Google Pay UPI LITE : మీరు Google Pay వాడుతున్నారా ?
అయితే అందులో మరో జబర్దస్త్ ఫీచర్ వచ్చింది..
అదేమిటంటే.. Google Pay తమ ప్లాట్ఫామ్లో UPI లైట్‌ని విడుదల చేసింది.
ఇంతకీ అదేంటి ? యూజర్స్ కు కలిగే సౌకర్యం ఏమిటి ?
ఇకపై గూగుల్ పే వినియోగదారులు UPI LITEను వినియోగించి UPI పిన్ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే.. ఒకే ఒక్క క్లిక్ లో వేగంగా UPI ట్రాన్సాక్షన్ చేయొచ్చు. UPI LITE అనేది వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు లింక్ అయి.. అందులోని డీటైల్స్ ఆధారంగా ట్రాన్సాక్షన్ ను సెకన్లలో ప్రాసెస్ చేస్తుంది. UPI LITE ద్వారా చేసే లావాదేవీల సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. UPI LITE ఖాతాలో(Google Pay UPI LITE) రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2000 చొప్పున అమౌంట్ ను లోడ్ చేసుకోవచ్చు. అంటే ఒక్క రోజులో ఈ అకౌంట్ లోకి మొత్తం రూ.4000 దాకా వేయొచ్చు. ఈ లోడ్ చేసిన అమౌంట్ నుంచి ఒక్కో ట్రాన్సాక్షన్ లో గరిష్టంగా రూ.200 దాకా ఇన్ స్టెంట్ యూపీఐ పేమెంట్ చేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నచిన్న పేమెంట్స్ కు ఇక గూగుల్ పేలో కేరాఫ్ అడ్రస్ గా UPI లైట్ మారుతుంది. ఈ చిన్నచిన్న పేమెంట్స్ అన్నీ ఒకే చోట UPI లైట్ పాస్ బుక్ లో నమోదై ఉంటాయి. కాబట్టి వాటిని అవసరమైనప్పుడు రివ్యూ చేసుకోవచ్చు. షాపింగ్ చేసే వారికి, గృహిణులు, స్టూడెంట్స్, చిరు వ్యాపారులు, కిరాణా దుకాణాలు నడుపుకునే వారికి UPI LITE బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.
Also read : Amazon Prime Day Sale: అమెజాన్ లో రెండు రోజులపాటు ప్రైమ్ డే సేల్.. ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్..!
Google Payలో UPI LITE యాక్టివేషన్ ఇలా..
- యూజర్లు Google Pay యాప్ లోని తమ ప్రొఫైల్ పేజీకి వెళ్లి.. UPI లైట్‌పై క్లిక్ చేసి దాన్ని యాక్టివేట్ చేయొచ్చు.
- దానికి అకౌంట్ లింకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, వినియోగదారులు తమ UPI LITE ఖాతాలో రూ. 2000 వరకు డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా రోజుకు రూ. 4000 దాకా ఈ అకౌంట్లో వేసుకోవచ్చు.
- UPI లైట్ ద్వారా ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 200 మించి చేయడానికి కుదరదు.
- UPI లైట్ అకౌంట్ ను యాక్టివేట్ చేసుకున్న తర్వాత .. రూ.200 కంటే తక్కువ ఉండే లావాదేవీలన్నీ డీఫాల్ట్‌గా UPI LITE ఖాతా నుంచే జరుగుతాయి.
- ట్రాన్సాక్షన్ చేసే క్రమంలో యూజర్స్ “Pay PIN-Free” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
Also read : US Recognised Arunachal Pradesh : చైనాకు చెక్.. అరుణాచల్ ను ఇండియాలో భాగంగా గుర్తించిన అమెరికా
UPI LITE -భారతీయ రిజర్వ్ బ్యాంక్
UPI లావాదేవీల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి UPI LITE ఫీచర్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2022 సెప్టెంబర్ లో ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా UPI LITE సేవలు అందుతాయి. ప్రస్తుతానికి 15 బ్యాంకులు UPI LITEకి సపోర్ట్ చేస్తున్నాయి. రాబోయే నెలల్లో మరిన్ని బ్యాంకులు ఈ లిస్టులో చేరే అవకాశం ఉంది.
Tags
Related News
Congenital Squint : మెల్లకన్ను ఉంటే ఎలా ? ఏం చేయాలి ?
చాలామందికి మెల్లకన్ను ఉంటుంది. దీన్నే ఇంగ్లిష్‌లో ‘స్క్వింట్ ఐ’ అని పిలుస్తారు.