US Recognised Arunachal Pradesh : చైనాకు చెక్.. అరుణాచల్ ను ఇండియాలో భాగంగా గుర్తించిన అమెరికా
US Recognised Arunachal Pradesh : చైనాకు చెక్ పెట్టే దిశగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
- By Pasha Published Date - 11:34 AM, Fri - 14 July 23
US Recognised Arunachal Pradesh : చైనాకు చెక్ పెట్టే దిశగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగంగా గుర్తిస్తూ అమెరికా కాంగ్రెస్ సెనెటోరియల్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ తీర్మానాన్ని సెనేటర్లు జెఫ్ మెర్క్లీ, బిల్ హాగెర్టీ, టిమ్ కైన్, క్రిస్ వాన్ హోలెన్ గురువారం ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది.
Also read : Ravichandran Ashwin: చెలరేగిన అశ్విన్.. అరుదైన రికార్డు సొంతం
కొన్ని వారాల క్రితం అమెరికాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశంపై అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చించారు. ఇండియా బార్డర్ లో చైనా సైన్యం ఆగడాల అంశాన్ని ఈసందర్భంగా బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఈనేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగంగా గుర్తిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ చైనా చేస్తున్న ప్రకటనలు వీగిపోయినట్టు అయింది. చైనా అరుణాచల్ ప్రదేశ్‌ని జాంగ్నాన్(US Recognised Arunachal Pradesh) అని పిలుస్తుంది. దాన్ని దక్షిణ టిబెట్‌గా డ్రాగన్ అభివర్ణిస్తుంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత అగ్రనేతలు, అధికారులు పర్యటించిన సమయాల్లో కూడా విమర్శలు చేయడం చైనాకు అలవాటుగా మారింది. ఈ వాదనను మొదటి నుంచే భారత్ బలంగా ఖండిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం “భారతదేశం నుంచి విడదీయరాని భాగం” అని భారత్ తేల్చి చెబుతోంది.
Also read : Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ అంటే ఏమిటి..? ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటో తెలుసా..?