ఆన్‌లైన్ మోసాలకు చెక్.. గూగుల్ ‘Circle to Search’ ఇప్పుడు మరింత సురక్షితం!
మీ ఫోన్‌లో Circle to Search ఫీచర్ లేకపోతే Google Lens ఒక మంచి ప్రత్యామ్నాయం. అనుమానాస్పద మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసుకుని, గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేసినా కూడా అది స్కామ్ అవునో కాదో తెలుసుకోవచ్చు.
- Author : Gopichand
Date : 05-01-2026 - 8:49 IST
Published By : Hashtagu Telugu Desk
Google Circle To Search: ఆన్‌లైన్ మోసగాళ్లు నిరంతరం తమ పద్ధతులను మారుస్తున్నారు. ఇప్పటికీ టెక్స్ట్ మెసేజ్‌లు వారి ప్రధాన ఆయుధంగా ఉన్నాయి. ఈ ముప్పును గుర్తించిన గూగుల్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తన Circle to Search ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. దీనివల్ల ఏదైనా అనుమానాస్పద సందేశం మీకు నష్టం కలిగించకముందే దానిని పసిగట్టవచ్చు.
స్కామ్ మెసేజ్‌లను గుర్తించడం ఎందుకు కష్టమవుతోంది?
బ్యాంక్ అలర్ట్‌లు లేదా అకౌంట్ బ్లాక్ అవుతుందనే బెదిరింపులు, ఇలాంటి మెసేజ్‌లు వినియోగదారులను భయాందోళనకు గురిచేయడానికి పంపిస్తారు. వినియోగదారులు తొందరపడి లింక్‌లపై క్లిక్ చేయాలని లేదా వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించాలని మోసగాళ్లు ప్రయత్నిస్తారు. ఇప్పుడు వస్తున్న స్కామ్ మెసేజ్‌లు ఎంత అసలువిగా కనిపిస్తున్నాయంటే, మొదటి చూపులో తేడాను కనిపెట్టడం చాలా కష్టమవుతోంది.
Circle to Searchలో కొత్త సేఫ్టీ ఫీచర్
ఈ ముప్పును ఎదుర్కోవడానికి గూగుల్ తన Circle to Search ఫీచర్‌ను మరింత స్మార్ట్‌గా మార్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. యూజర్ ఎటువంటి లింక్‌పై క్లిక్ చేయకుండా లేదా మెసేజ్‌కు సమాధానం ఇవ్వకుండానే దానిని తనిఖీ చేయవచ్చు.
Also Read: టీమ్ ఇండియాలోకి శ్రేయస్ అయ్యర్ పునరాగమనం.. కెప్టెన్‌గా ఎంపిక!
మెసేజ్‌పై రౌండ్ చుడితే చాలు.. సమాధానం వస్తుంది
Circle to Search ఆన్ చేయడానికి హోమ్ బటన్ లేదా నేవిగేషన్ బార్‌ను కాసేపు నొక్కి పట్టుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపిస్తున్న అనుమానాస్పద మెసేజ్ చుట్టూ వేలితో ఒక వృత్తం గీయాలి.
పనితీరు: గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆన్‌లైన్ డేటా సహాయంతో ఆ మెసేజ్‌ను విశ్లేషించి, అది స్కామ్ కావచ్చా లేదా అనేది క్షణాల్లో మీకు తెలియజేస్తుంది.
అప్రమత్తత: ఈ ఫీచర్ కేవలం ముప్పు గురించి చెప్పడమే కాకుండా ఆ మెసేజ్‌లో ఏ అంశాలు అనుమానాస్పదంగా ఉన్నాయో కూడా వివరిస్తుంది. ఇది భవిష్యత్తులో ఇలాంటి మెసేజ్‌లను మీరు సొంతంగా గుర్తించేలా అవగాహన కల్పిస్తుంది.
Circle to Search లేదా? ప్రత్యామ్నాయం ఇదే!
మీ ఫోన్‌లో Circle to Search ఫీచర్ లేకపోతే Google Lens ఒక మంచి ప్రత్యామ్నాయం. అనుమానాస్పద మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసుకుని, గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేసినా కూడా అది స్కామ్ అవునో కాదో తెలుసుకోవచ్చు.