HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Fire Boltt Launched New Rouged Smartwatch In India Check Specs Features And Price

Fire-Boltt Smartwatch: అద్భుతమైన ఫీచర్ లతో మతి పోగుడుతున్న గ్రెనేడ్ స్మార్ట్ వాచ్.. వివరాలు ఇవే?

దేశవ్యాప్తంగా స్మార్ట్ వాచ్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్ లపై ఆసక్తిని చ

  • Author : Anshu Date : 02-07-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fire Boltt Smartwatch
Fire Boltt Smartwatch

దేశవ్యాప్తంగా స్మార్ట్ వాచ్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్ లపై ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ వాచ్ ల కొనుగోలుదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో పలు రకాల స్మార్ట్ వాచ్ కంపెనీలు మార్కెట్ లోకి కొత్త కొత్త స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఫైర్ బోల్ట్ ఒక సరికొత్త స్మార్ట్ వాచ్ ను ఆవిష్కరించింది.

అత్యంత ధృడమైన డిజైన్ తో పాటు స్మార్ట్ డిజైన్ తో ఈ వాచ్ ఆకట్టుకుంటోంది. గ్రెనేడ్ స్మార్ట్ వాచ్ అనే పేరుతో వాచ్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ వాచ్ లో 1.39-అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, అనేక హెల్త్, ఫిట్‌నెస్ మోడ్‌లు ఉన్నాయి. కాగా ఈ స్మార్ట్ వాచ్ ధర, ఫీచర్స్ విషయానికి వస్తే.. ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ స్మార్ట్ వాచ్ ప్రారంభ ధర రూ. 1,999గా ఉంది. ఇది ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్ లలో లాంచ్ అయ్యింది మెటాలిక్, సిలికాన్ స్ట్రాప్ లతో వస్తోంది.

మెటాలిక్ స్ట్రాప్‌తో కూడిన స్మార్ట్‌వాచ్ మనకు గోల్డ్, సిల్వర్ బ్లాక్ కలర్‌లలో లభిస్తోంది. సిలికాన్ స్ట్రాప్ లు కామో బ్లాక్, కామో-గ్రీన్, ఆరెంజ్ గోల్డ్, గన్‌పౌడర్ బ్లాక్, గోల్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ స్మార్ట్‌ వాచ్ లో 1.39-అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేతో వృత్తాకార డయల్, సైడ్ ఎడ్జ్‌లో బటన్‌లను అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మిలిటరీ-గ్రేడ్ అంతా ధృడంగా, షాక్‌ప్రూఫ్ బాడీతో వస్తుందని కంపెనీ పేర్కొంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. అంతర్నిర్మిత స్పీకర్, మైక్రోఫోన్‌ ఉంటుంది. ఇకపోతే హెల్త్ ఫీచర్స్ విషయానికి వస్తే..

ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ కంపెనీ హెల్త్ సూట్‌ను కలిగి ఉంది. ఇది మహిళల ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడంతో పాటు, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మోనిటర్, ఆక్సిజన్ లెవెల్స్ తనిఖీ చేస్తుంది. ఇది సరికొత్త స్ప్లాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది. వినియోగదారులను ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంచడానికి 123 విభిన్న స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫైర్-బోల్ట్ గ్రెనేడ్ 350ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై ఒక వారం రోజుల వరకు పని చేస్తుంది. కానీ మీరు బ్లూటూత్ కాలింగ్ ఉపయోగిస్తే మాత్రం కేవలం రెండు రోజులు ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • Fire-Boltt Smartwatch
  • india
  • price
  • smartwatch

Related News

India summons Russia following the death of four Indians in an attack on a merchant vessel off the coast of Ukraine.

Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి నెలల్లో ఒడెసా సమీపంలోని నల్ల సముద్ర నౌకా మార్గాలపై దాడులు పునరావృతమవుతున్నాయి. ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగి నలుగురు భారతీయులు మరణించిన మరుసటి రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలోని రష్యా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. గినియా-బిస్సావు జెండా కలిగి

  • Prime Minister's remarks on Rahul Gandhi at the start of the Parliament's Monsoon Session.

    Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

  • Balochistan has 'declared independence' from Pakistan.

    Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

Latest News

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

  • Donald Trump: కెనడియన్ వస్తువులపై 50% సుంకాలు విధించిన అమెరికా.. ఉత్తర అమెరికా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం.

  • Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్‌.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd