Aadhaar: ఆధార్ లో మొబైల్ నెంబర్ మార్చుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!
భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. నేటి రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. బ్యాంకు అకౌంట్,పాన్ కార్డ్ వంటి సేవలతో
- By Anshu Published Date - 02:01 PM, Fri - 12 July 24

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. నేటి రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. బ్యాంకు అకౌంట్,పాన్ కార్డ్ వంటి సేవలతో పాటుగా ప్రభుత్వ ప్రైవేటు పథకాలకు కూడా ఈ ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. అయితే మరి అలాంటి ఆధార్ కార్డులో పేరు, డేటాఫ్ బర్త్,జెండర్, ఇంటి అడ్రస్ ఇలా ప్రతి ఒకటి కూడా కరెక్ట్ గా ఉండాలి.
అందులో ఏ ఒక్కటీ సరిగా లేకపోయినా సరే చూసుకోమని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఒకవేళ మీ ఆధార్ కార్డులో మీ మొబైల్ నెంబర్ ను మార్చుకోవాల్సి ఉంటే అలాంటప్పుడు ఏం చేయాలి సులువుగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను మార్చుకోవాలని సులభంగా చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్ తప్పుగా ఉంటే, మీరు వెంటనే దాన్ని మార్చుకోవాలి. లేదా మీరు వేరే నంబర్‌ను యాడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. కానీ మీరు ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్ ను మార్చలేరు.
మీరు మీ ఇంటికి దగ్గర లోని ఈ సేవా కేంద్రాల్లో మాత్రమే మీ మొబైల్ నంబర్ ను మార్చుకోవచ్చు. అయితే ఇందుకోసం ఆధార్ ఇ సేవా కేంద్రానికి వెళ్లి, అక్కడ ఒక ఫారమ్ ఇస్తారు. అందులో మీరు ఉపయోగించాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత చేతిముద్ర, కంటి నమోదు చేయించుకోవాలి. తర్వాత నింపిన ఫారాన్ని మీసేవ కేంద్రాల అధికారులకు అందజేయాలి. ఇందుకు రూ.50 రుసుము వసూలు చేస్తారు. దీన్ని అనుసరించి మార్పులు చేయడానికి మీకు నంబర్ ఇవ్వబడుతుంది. ఆధార్ వెబ్‌సైట్ ద్వారా ఆ నంబర్‌తో మీ మొబైల్ నంబర్ మారిందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్ 90 రోజుల్లో అప్‌డేట్ అవుతుంది.