EMI Offer: రోజుకి రూ.30 తో 5 జీ స్మార్ట్ ఫోన్ మీ సొంతం.. పూర్తి వివరాలు ఇవే?
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మార్కెట్ లోకి రకరకాల విడుదల చేయడంతో పాటు అద్భుతమైన ఆఫర్ లను కూడా అందిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అ
- By Nakshatra Published Date - 07:30 PM, Mon - 24 July 23
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మార్కెట్ లోకి రకరకాల విడుదల చేయడంతో పాటు అద్భుతమైన ఆఫర్ లను కూడా అందిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను అందిస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు కూడా స్మార్ట్ ఫోన్ లపై మంచి మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా అమెజాన్ సంస్థ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ పై బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. EMI ఆఫర్లో కేవలం రూ.30 చెల్లించి మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
iQOO Z7s మోడల్‌ను iQOO ఇండియా ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌లో తక్కువ EMI ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇంతకుముందు iQoo Z7 మోడల్ ఇండియాలో కూడా ప్రారంభించబడింది. ఈ రెండు మొబైల్ల మధ్య వ్యత్యాసం చిప్సెట్. iQoo Z7 మొబైల్లో MediaTek ప్రాసెసర్ ఉండగా, iQoo Z7S ఫోన్లో Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ ఉంది. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న iQoo Z7S మొబైల్‌పై అద్భుతమైన ఆఫర్ ఉంది. కాగా ఈ ఫోన్ మనకు రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. అందులో ఒకటి 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు రెండు రంగులలో లభించునుంది.
ఒకటి నార్వే బ్లూ, రెండవది పసిఫిక్ నైట్ కలర్. ఈ ఫోన్ ని మీరు బ్యాంక్ ఆఫర్‌తో మీరు రూ.1,750 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌తో, మీరు iQoo Z7Sని కేవలం రూ.17,499కే కొనుగోలు చేయవచ్చు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. నెలకు రూ.908 EMIతో మీరు ఈ మొబైల్‌ని సొంతం చేసుకోవచ్చు. అంటే రోజుకు కేవలం రూ.30 చెల్లిస్తే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ మీ సొంతం అవుతుంది. నోకాస్ట్ EMI ఆఫర్లు 3 నెలలు, 6 నెలలు 12 నెలల ఆప్షన్ లతో అందుబాటులో ఉన్నాయి. iPhone Z7S మొబైల్లో అమెజాన్‌లో అద్భుతమైన ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. అమెజాన్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.17,900 అందిస్తోంది.
మీ పాత మొబైల్‌ని మార్చుకొని రూ.17,900 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందండి. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు పూర్తి తగ్గింపు వర్తింపజేస్తే, మీరు కేవలం రూ.1,099 చెల్లిస్తే సరిపోతుంది. iQoo Z7S స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.38-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది గత సంవత్సరం విడుదలైన ప్రముఖ 5G ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్‌తో ఇప్పటికే లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. ఇది 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. అలాగే 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Related News
Akhil Akkineni : అయ్యగారు వచ్చి ఏడాది.. ఇంకా ఓటీటీలోకి రాని ఏజెంట్
తెలుగు చిత్ర పరిశ్రమలో విశిష్టమైన అక్కినేని కుటుంబానికి చెందిన వారసుడు అఖిల్ అక్కినేని ఎంతగానో ఎదురుచూసిన ' ఏజెంట్ ' చిత్రంలో నటించడంతో ఎన్నో ఆశలతో ప్రయాణం ప్రారంభించాడు .