TCongress
-
#Telangana
Bhatti Vikramarka: డ్వాక్రా మహిళలకు టీకాంగ్రెస్ గుడ్ న్యూస్.. ఇకపై వడ్డీ లేని రుణాలు
Bhatti Vikramarka: డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. గత నాలుగేండ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పట్నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సాక్షిగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెబుతున్నాం. ఇప్పటికే మహిళలకు పెద్దపీట […]
Date : 18-02-2024 - 11:17 IST -
#Speed News
Free Power: ఉచిత కరెంట్ స్కీమ్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ ముఖ్యమైన విషయాలు తెలుసా
Free Power: రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. బయోమెట్రిక్ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచించింది. దీని ప్రకారం ఈ పథకం కోసం లబ్ధిదారుల ఎంపికకు పూర్తి స్థాయి మార్గదర్శకాలు […]
Date : 18-02-2024 - 5:35 IST -
#Speed News
TCongress: రైతు బంధు నిబంధనలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, వారికే డబ్బులు?
TCongress: రైతు బంధు నిబంధనలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాల లోపు వారికే రైతుబంధు ఇవ్వాలనే ఆలోచలనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గత ఏడాది వానాకాలం లెక్కల ప్రకారం 68.99 లక్షల మందికి రైతు బంధు సాయం అందింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న..రైతుల సంఖ్య 6.65 లక్షలు ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వీరి వద్దే […]
Date : 15-02-2024 - 12:17 IST -
#Speed News
TCongress: ఆ లోక్ సభ స్థానం కోసం స్థానికుల పట్టు, టీకాంగ్రెస్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో
TCongress: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీలకు కష్టంగా మారింది. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈసారి స్థానికులనే పోటీకి దింపాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్ని పార్టీల నుంచి స్థానికేతర అభ్యర్థులే పోటీకి దిగుతున్నారు. అర్హత, అనుభవం ఉన్నప్పటికీ ఇక్కడి అభ్యర్థులకు అవకాశం లభించడం లేదు. కారణాలు ఏవైనా దాదాపు అన్ని పార్టీలు బయటి అభ్యర్థులకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాయి. దీంతో స్థానికులకు అవకాశం దకడం లేదన్న […]
Date : 15-02-2024 - 12:10 IST -
#Telangana
TCongress: హైదరాబాద్ లో హస్తం పార్టీ హవా, బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలమేనా!
TCongress: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ను పక్కనపెట్టి బీఆర్ఎస్ ను గెలిపించారు. గ్రేటర్ పరిధిలో తాము చేసిన అభివృద్ధి వల్లే ప్రజలు గెలిపించాలని అప్పట్లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ సత్తా చూపిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే గ్రేటర్ పరిధిలో కారు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటి దూకుడు ఇప్పుడు సన్నగిల్లే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ […]
Date : 13-02-2024 - 12:20 IST -
#Speed News
Bandi Sanjay: బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బిజెపి కి పట్టలేదు: బండి సంజయ్
Bandi Sanjay: వేములవాడలో ప్రజాహిత యాత్ర లో బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టిని మళ్ళించడానికే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో 400 టీఎంసీల నీటిని ఏపీకి కట్టబెడితే, కేసిఆర్ పాలనలో 812 టీఎంసీల నీటిని సీమకు దోచిపెట్టారని ఆరోపించారు. 1212 టిఎంసీల కృష్ణా జలాలను ఏపికి […]
Date : 12-02-2024 - 11:51 IST -
#Speed News
MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చుతుందే కానీ ప్రగతి గేర్లను మార్చడం లేదు
MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడుతామని అంటున్నది తప్ప ప్రగతి గేర్లను మార్చడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం ఈ బడ్జెట్ ను చూస్తే అర్థమవుతుతోందని తేల్చిచెప్పారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష చొప్పున అందించేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని […]
Date : 10-02-2024 - 5:46 IST -
#Speed News
Book Fair: ఈ నెల 9 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
Book Fair: హైదరాబాద్ బుక్ ఫెయిర్(36వ జాతీయ పుస్తక ప్రదర్శన)ను ఈ నెల 9 నుంచి 19 వరకు జరగనుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో బుక్ ఫెయిర్ నిర్వహించేందుకు వేదికలు దొరకని దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బుక్ ఫెయిర్ ఓ పండుగలా జరుగుతోంది. ఈ సారి బుక్ ఫెయిర్ ప్రాంగణా నికి ప్రజా గాయకుడు గద్దర్ పేరును పెట్టినట్టు తెలిపారు. అలాగే బుక్ ఫెయిర్ వేదికకు సంస్కృత పండితుడు, ద్రవిడ యూనివర్సిటీకి వీసీగా ఉన్న దివంగత […]
Date : 08-02-2024 - 1:09 IST -
#Speed News
Jeevan Reddy: ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి రేవంత్ తో మాట్లాడుతూ: జీవన్ రెడ్డి
Jeevan Reddy: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించడానికి తానే భాధ్యత తీసుకుంటానని మాజీమంత్రి, కాంగ్రేస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ల కు హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి […]
Date : 08-02-2024 - 10:06 IST -
#Telangana
CM Revanth: 15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్
CM Revanth: రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. పదేండ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32 లక్షల మంది […]
Date : 08-02-2024 - 12:06 IST -
#Telangana
TSPSC Group1: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్-1 పోస్టుల పై కీలక నిర్ణయం
TSPSC Group1: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే ఆరుగ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 పోస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు తాజాగా 503 పోస్టులు.. […]
Date : 06-02-2024 - 5:28 IST -
#Telangana
MLC Kavitha: కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం […]
Date : 06-02-2024 - 5:02 IST -
#Speed News
BRS: కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోంది: బీఆర్ఎస్
BRS: బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం నందినగర్ లోని నివాసంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకించారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భావిస్తూ.. కేఆర్ఎంబికి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్ర కాంగ్రేస్ […]
Date : 05-02-2024 - 2:19 IST -
#Speed News
CM Revanth: ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రూ.500 సిలిండర్ పథకం ప్రారంభం: సీఎం రేవంత్
CM Revanth: కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం కింద రూ.500 ఎల్‌పిజి సిలిండర్‌ను ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం నాగోబా ఆలయ దర్బార్ హాలులో మహిళా స్వయం సహాయక సంఘాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కానీ, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పథకం ప్రారంభించిన తేదీ, సమయాన్ని పేర్కొనలేదు. ‘‘ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకుంటున్నాం. 200 యూనిట్ల విద్యుత్తు పథకాన్ని ఉచితంగా […]
Date : 02-02-2024 - 7:29 IST -
#Telangana
LS Tickets: లోక్ సభ టికెట్ రేసులో కాంగ్రెస్ సీనియర్స్, పోటాపోటీగా లాబీయింగ్!
LS Tickets: ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ బరిలో నిలిచేందుకు పలువురు సీనియర్లు టికెట్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. 17 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తుపై పూర్తి అధికారాన్ని హైకమాండ్‌కు అప్పగించాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ, తీవ్రమైన పోటీ, లాబీయింగ్ నెలకొంది. తమ సీనియార్టీతో ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఖమ్మం సీటుపై చాలా మంది సీనియర్లు […]
Date : 01-02-2024 - 3:05 IST