HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Cause Is The Tea Congress Party Which Is Resurgent In Greater Hyderabad

TCongress: హైదరాబాద్ లో హస్తం పార్టీ హవా, బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలమేనా!

  • Author : Balu J Date : 13-02-2024 - 12:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana to k Congress
Kcr And Revanth

TCongress: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ను పక్కనపెట్టి బీఆర్ఎస్ ను గెలిపించారు. గ్రేటర్ పరిధిలో తాము చేసిన అభివృద్ధి వల్లే ప్రజలు గెలిపించాలని అప్పట్లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ సత్తా చూపిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే గ్రేటర్ పరిధిలో కారు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటి దూకుడు ఇప్పుడు సన్నగిల్లే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొద్ది రోజుల తేడాతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేసేందుకే తాము ముఖ్యమంత్రిని కలిశామని వారు ప్రకటించారు. కానీ అంతకుముందు మెదక్ జిల్లా పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం చర్చకు దారితీస్తోంది.

అయితే వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహా గానాలు వినిపించాయి. ఆ ఎమ్మెల్యేలు కూడా ఆ వ్యాఖ్యలను కొట్టి పారేశారు. కొద్దిరోజుల తర్వాత గ్రేటర్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అంతకుముందు గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లతో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్, కొంతమంది కార్పొరేటర్లు గైరాజులయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే తాము గైర్హాజరయ్యామని వారు చెప్పినప్పటికీ అసలు వాస్తవం అది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారి గైర్హాజరు తో భారత రాష్ట్ర సమితిలో కలకలం చెలరేగింది.

రాష్ట్రంలో పలు మునిసిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఇప్పటివరకు కొనసాగిన భారత రాష్ట్ర సమితి చైర్మన్లు మాజీలు అయిపోతున్నారు. దాదాపు 20 మున్సిపాలిటీలో భారత రాష్ట్ర సమితి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇచ్చి చైర్మన్లను దింపేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 20 మున్సిపాలిటీలు చేరాయి. ఇన్ని మున్సిపాలిటీలు తన ఖాతాలో పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఎందుకు వద్దనుకుంటుంది? ఈ క్రమంలోనే మేయర్ గద్వాల విజయలక్ష్మి రేవంత్ రెడ్డిని కలిశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు గతంలో డిప్యూటీ మేయర్ గా పని చేసిన బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఈయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో విస్తృతంగా పనిచేశారు. భారత రాష్ట్ర సమితి అంతమంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. త్వరలో పార్లమెంటు ఎన్నికల్లో నేపథ్యంలో ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం భారత రాష్ట్ర సమితికి పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • cm revanth
  • operation
  • TCongress

Related News

Ktr

పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన ఫిట్‌నెస్‌పై చేసిన ఓ సరదా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో అడుగుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. పొట్టను దాచుకోవడం కష్టంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చమత్కరించారు. ఈ మేరకు కేటీఆర్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. “పొట్టను దాచుకోలేక విసిగి

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • There Will Be No Urea Probl

    Urea Shortage : రైతులకు గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇకపై యూరియా కష్టాలు ఉండవు !!

  • Telangana Congress Nominate

    Rajyasabha : రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణ నుండి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

Latest News

  • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd