HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Is Impatient That There Is No Anarchy In Pulivendula Cm Chandrababu

CM Chandrababu : పులివెందులలో అరాచకాలు జరగలేదనే అసహనంలో జగన్‌ : సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా సీఎంఆర్‌ఎఫ్‌ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి సాయం అందించారు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంనుంచి ఇప్పటివరకు పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరగడం లేదు.

  • Author : Latha Suma Date : 13-08-2025 - 6:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan is impatient that there is no anarchy in Pulivendula: CM Chandrababu
Jagan is impatient that there is no anarchy in Pulivendula: CM Chandrababu

CM Chandrababu: పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచక పాలన నుంచి బయటపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రజల వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎంఆర్‌ఎఫ్‌ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి సాయం అందించారు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంనుంచి ఇప్పటివరకు పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరగడం లేదు. ప్రజలను బెదిరించడం, అభ్యర్థులను పోటీకి భయపడేలా చేయడం అనేది సర్వసాధారణంగా మారింది. కానీ ఈసారి ప్రజలు ధైర్యంగా నిలబడారు. 11 మంది అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేశారు. ఇది నిజమైన ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం అని చంద్రబాబు తెలిపారు.

Read Also:  MLC post : కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల ఎమ్మెల్సీ పదవులు రద్దు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఈసారి పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు. ఇది శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ఓటేయగలిగారని నిరూపిస్తోంది. జగన్ ఇప్పుడు అసహనంతో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు అలాంటి గూండా రాజకీయాలు లేకుండా ఎన్నిక జరిగితే ఫలితం ఏమవుతుందో తెలుసు. పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి పనిచేయాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు, ప్రజల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గత పాలనలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, ఇప్పుడు సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యంగా తీసుకున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల పరిస్థితిపై స్పందించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉన్నదని చెప్పారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా మారింది. కొన్ని ప్రదేశాల్లో జననష్టాలు సంభవించాయి, ఇది అత్యంత బాధాకరం అన్నారు చంద్రబాబు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాల వారీగా మంత్రులు పరిస్థితిని సమీక్షిస్తూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని వెల్లడించారు. వర్షాల కారణంగా నష్టాన్ని తగ్గించేందుకు ఎక్కడికక్కడ వెంటనే చర్యలు చేపట్టాలి. అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా చూడటం ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా పేర్కొన్న సీఎం చంద్రబాబు, అన్ని విభాగాలు సమన్వయంగా పనిచేయాలని సూచించారు.

Read Also: Indus Waters Treaty : భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Democratic elections
  • flood alert
  • heavy rainfall
  • Pulivendula
  • ys jagan

Related News

Amaravati Inner Ring Road Case

Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Chandrababu  ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐకి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు దర్యాప్తును అప్పగించాలని, ఈ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని, ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Hyderabad Rain

    Hailstorm: రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో పలు చోట్ల వడగళ్ల వాన

  • Chandranna Sarkar Gives Gre

    ‘Sakhi Niwas’ : ఏపీ మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన చంద్రన్న సర్కార్

Latest News

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

  • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd