Latest News
-
#India
RBI : పేటీఎం ఎఫెక్ట్.. మరిన్ని సంస్థలపై ఆర్బీఐ ఫోకస్
ఇటీవల పేటీఎం (Paytm)పై నిషేధం విధించిన ఆర్బీఐ (RBI).. మరిన్ని ఆన్లైన్ పేమెంట్ కంపెనీలపైనా దృష్టి సారించింది. పేటీఎం మాదిరి మరో 4 సంస్థల కేవైసీ నిర్వహణలో లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వాటిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు పేటీఎంపై దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఆర్బీఐ ఆరోపణల నేపథ్యంలో సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు కొన్ని పత్రాలను దర్యాప్తు సంస్థకు సమర్పించారు. We’re now on WhatsApp. Click to Join. ఫిబ్రవరి 29 తర్వాత Paytm […]
Date : 16-02-2024 - 12:42 IST -
#Speed News
Allu Arjun : కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ..
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందకు ఆసక్తిగా ఉన్న నేతలు పావులు కదుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. అంతేకాకుండా.. కొందరు బాహటంగా కాంగ్రెస్(Congress) లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే.. తాజాగా ఇప్పుడు ఐకాన్ స్టార్ […]
Date : 16-02-2024 - 12:31 IST -
#Andhra Pradesh
MVV Satyanarayana : ఇంటికొచ్చి కొడతా.. జనసేన నేతకు వైసీపీ ఎంపీ వార్నింగ్
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్లి తమ వైపు మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే.. నిన్న విశాఖపట్నం ఎంపీ, వైఎస్సార్‌సీపీ (YSRCP) తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని, రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోతారని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ (Janasena Party) (జేఎస్పీ) పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణ […]
Date : 16-02-2024 - 11:33 IST -
#Andhra Pradesh
Rathasaptami: అరసవల్లి సూర్యదేవాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ (Arasavelli Suryanarayana Temple) స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. రథసప్తమి (Ratha Saptami Celebrations) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వెలుగుల రేడు జయంత్యుత్సవం కావడంతో అర్ధరాత్రి పన్నెండున్నరకు ఉత్సవానికి అంకురార్పణం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఆలయ పూజారులు, వివిధ హిందూ మత సంస్థల మఠాధిపతులు ఆలయ ఆలయానికి క్షీరాభిషేకంతో ఉత్సవాన్ని ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు ఎమ్మెల్యేలు, […]
Date : 16-02-2024 - 11:14 IST -
#Andhra Pradesh
Birdflu : ‘బర్డ్ ఫ్లూ’ కలకలం.. అక్కడ 3 నెలలు చికెన్ షాపుల బంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం రేపుతోంది. పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు భారీగా మృత్యువాత పడుతున్నాయి. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ హరినారాయణ్.. ‘కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10కి.మీ పరిధిలో 3రోజులు చికెన్ షాపులు మూసేయాలి. 1 కి.మీ పరిధిలోని షాపులను 3నెలలు తెరవకూడదు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలి. ఫామ్స్, చికెన్ షాపుల్లో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆయన సూచించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అనేక చోట్ల చికెన్ […]
Date : 16-02-2024 - 11:00 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : హరిరామ జోగయ్య డిమాండ్.. టీడీపీకి కష్టమే..?
తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటికే రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళతాయని ప్రకటించిన రెండు పార్టీల మధ్య చిచ్చు రాజుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు అత్యధిక స్థానాలు కేటాయించాలని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బుధవారం బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరిలో కాపు ఓట్లు 90 శాతం ఉన్నందున పశ్చిమగోదావరి జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు, నరసాపురం […]
Date : 14-02-2024 - 7:05 IST -
#Andhra Pradesh
Botsa Satyanarayana : మాపై విమర్శలు తప్ప ప్రతిపక్షాలు చేసేదేం లేదు
ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప ప్రతిపక్షాలు చేసేదేమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రతిధ్వనించారు, వారు మంచి పనితీరు కనబరిచినట్లయితే మరొక అవకాశం అడగడంలో సమస్య ఏమిటని ప్రశ్నించారు. రాజధాని విషయంలో తమ పార్టీ విధానానికి కట్టుబడి ఉన్నామని మంత్రి సమర్థించారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన వక్రీకరణ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ చంద్రబాబు రాజధానిని వదులుకుని ప్రస్తుత పరిస్థితిని సృష్టించారని విమర్శించారు. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని […]
Date : 14-02-2024 - 6:57 IST -
#Andhra Pradesh
Nara Lokesh : మేం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాకముందు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఉద్యోగ క్యాలెండర్ (Job Calendar) ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమై యువతను మోసం చేశారని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, కూటమి అధికారంలోకి రాగానే వివిధ […]
Date : 14-02-2024 - 6:02 IST -
#Speed News
Raging : రామగుండంలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లకు గుండు కొట్టించిన సీనియర్లు
ర్యాగింగ్ భూతం మళ్లీ కురులు విప్పుకుంటోంది. గతంలో విచక్షణ రహితంగా విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడుతుండటంతో ర్యాగింగ్‌పై చట్టసభల్లోనూ చర్చలు చేసి చట్టాలు తీసుకువచ్చారు. దీంతో కొంతకాలంగా ర్యాగింగ్ భూతం కనిపించకుండా పోయినా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. విద్యార్థుల మధ్య మనస్పర్థలు కాస్త ర్యాగింగ్ రూపంలో బయటకు వస్తున్నాయి. దీంతో.. తోటి విద్యార్థులపై విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా.. ర్యాగింగ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల ర్యాగింగ్‌కు బాధితులైన ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలే. అయితే.. […]
Date : 14-02-2024 - 12:26 IST -
#Speed News
Big News : మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్ల (Municipal Commissioner Transfers) బదిలీలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. లోక్ సభ ఎన్నికలు (Parliament Elections) సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఎన్నికల సంఘం సూచనలతో 74 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతకుముందు 40 మంది మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం […]
Date : 14-02-2024 - 11:40 IST -
#India
Narendra Modi : యూఏఈలో హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నేడు యూఏఈ (United Arab Emirates)లోని అబుదాబిలో బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (Sri Akshar Purushottam Swamynarayan) హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్య ఆసియాలోనే హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయమిదే. 2014లో మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక ఈ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. ప్రస్తుతం ఆయన ఏడోసారి యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈ ఆలయం ఆ దేశ మత సామరస్యానికి ప్రతీకగా నిలవనుంది. […]
Date : 14-02-2024 - 11:15 IST -
#Andhra Pradesh
CM Jagan : నేడు పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,833 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,024 కోట్లతో 8 ప్రాంతాల్లో బయో గ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ బయో ఎనర్జీ (Reliance Bio Energy Limited) ఏర్పాటు చేయనుంది. ఆదిత్య బిర్లా గ్రూపు (Aditya Bilra Group) రూ.1,700 కోట్లతో నాయుడుపేటలో […]
Date : 14-02-2024 - 10:51 IST -
#Speed News
BREAKING: గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల..
ఏపీలో గ్రూప్-2 (Group-2) అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) తీపికబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్-2 హాల్టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అయితే.. గ్రూప్-2లో 899 పోస్టుల కోసం 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని APPSC సూచించింది. అయితే.. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల […]
Date : 14-02-2024 - 10:30 IST -
#Speed News
TS Assembly : అసెంబ్లీలో ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ (Telanana Assembly Session) లో నేడు ఐదో రోజు సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈనేపథ్యంలోనే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. చర్చలో భాగంగా సభ్యుల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. We’re now […]
Date : 14-02-2024 - 10:11 IST -
#Speed News
TS ECET 2024: విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) TS ECET-2024కు సంబంధించిన నోటిఫికేషన్ (Notification)ను విడుదల చేసింది. డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) చదువుతున్న విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాలంటే ఇందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మే 6వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫీజు SC, ST, పీహెచ్ అభ్యర్థులకు రూ.500, ఇతరులకు రూ.900. ఆలస్య రుసుం రూ. 500తో ఏప్రిల్ […]
Date : 14-02-2024 - 9:45 IST