CM Jagan : నేడు పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్న జగన్
- Author : Kavya Krishna
Date : 14-02-2024 - 10:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,833 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,024 కోట్లతో 8 ప్రాంతాల్లో బయో గ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ బయో ఎనర్జీ (Reliance Bio Energy Limited) ఏర్పాటు చేయనుంది. ఆదిత్య బిర్లా గ్రూపు (Aditya Bilra Group) రూ.1,700 కోట్లతో నాయుడుపేటలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్ను నెలకొల్పనుంది. వీటితో పాటు హెల్లా ఇన్ఫ్రా (Hella Infra), వెసువియస్ ఇండియా లిమిటెడ్ (Vesuvius India Limited) ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రిలయన్స్ బయో ఎనర్జీ రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో మొత్తం రూ.1,024 కోట్ల పెట్టుబడితో తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో వ్యవసాయ వ్యర్థాల నుంచి బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. తద్వారా 576 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇదే కాకుండా.. ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.1,700 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీని ద్వారా 250 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వీటితో పాటు హెల్లా ఇన్ఫ్రా, వెసూవియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్, అన ఒలియో ప్రైవేట్ లిమిటెడ్క చెందిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ వర్చువల్‌గా క్యాంపు కార్యాలయం నుంచి శంకుస్థాపనలతో పాటు పలు యూనిట్లను ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉంటే.. రేపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ కర్నూలు చేరుకొని అక్కడ బళ్ళారి రోడ్లోని ఫంక్షన్ హాల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరకొని, ఆ తర్వాత మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో వలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.
Read Also : BREAKING: గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల..