Big News : మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
- By Kavya Krishna Published Date - 11:40 AM, Wed - 14 February 24

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్ల (Municipal Commissioner Transfers) బదిలీలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. లోక్ సభ ఎన్నికలు (Parliament Elections) సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఎన్నికల సంఘం సూచనలతో 74 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతకుముందు 40 మంది మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటే.. ఇటీవల.. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో కూడా ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. రూరల్ డెవలప్ మెంట్ శాఖలో 105 మందిని బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సెజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా బదిలీ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని స్థాయిల ఎన్నికల అధికారులకు శిక్షణ, ఈవీఎంల పరిశీలన, ఓటరుకార్డుల ముద్రణను చేపట్టింది ఎన్నికల సంఘం. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్తగా ఓటుహక్కు పొందిన, చిరునామా మార్చుకున్న దాదాపు 15 లక్షల మంది కొత్తగా ఓటరుకార్డు అందుకోనున్నారు. ఓటరుకార్డుల పంపిణీ కోసం పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది ఎన్నికల సంఘం. దశాబ్దం క్రితం జారీ చేసిన ఓటరుకార్డు స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలనే ప్రతిపాదనకు సైతం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తే మరో 40 లక్షలకార్డులను ముద్రించాల్సి ఉంటుంది. అయితే, దేశవ్యాప్తంగా ఓటరుకార్డు ముద్రణ కేంద్రాల సంఖ్య తక్కువగా ఉండటంతో దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
Read Also : Narendra Modi : యూఏఈలో హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ