HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ts Ecet 2024 Notification Released

TS ECET 2024: విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల

  • Author : Kavya Krishna Date : 14-02-2024 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Inter Exam 2022 Ap

ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) TS ECET-2024కు సంబంధించిన నోటిఫికేషన్‌ (Notification)ను విడుదల చేసింది. డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) చదువుతున్న విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాలంటే ఇందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మే 6వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫీజు SC, ST, పీహెచ్ అభ్యర్థులకు రూ.500, ఇతరులకు రూ.900. ఆల‌స్య రుసుం రూ. 500తో ఏప్రిల్ 22 వ‌ర‌కు, రూ. 1000తో ఏప్రిల్ 28వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించొచ్చని పేర్కొన్నారు. అయితే.. ఏప్రిల్ 24 నుంచి 28వ తేదీ మ‌ధ్యలో అభ్యర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించనున్నారు. మే 1వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. మే 6వ తేదీన ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు రాత‌ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు.
We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. జేఈఈ మెయిన్స్ (JEE Mains) సెషన్-1 2024 పరీక్షా ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 23 మంది విద్యార్థులు వంద శాతం మార్కులతో అదరగొట్టగా.. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పది మంది విద్యార్థులు ఉండటం విశేషం. ఎన్టీఏ విడుదల చేసిన ఫస్ట్‌ పేపర్ బీఈ, బీటెక్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోర్‌ సాధించగా.. ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరిలో తెలంగాణాకు చెందిన రిషి శేఖర్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, ముతవరకు అనూప్, హుందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డిలు వంద శాతం స్కోరును సాధించి తెలంగాణ ఖ్యాతిని పెంచారు.
Read Also : Megastar Chiranjeevi : మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీ.. వెబ్ సీరీస్ తో షాక్ ఇవ్వనున్న చిరు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • big news
  • breaking news
  • Latest News
  • telugu news
  • TS ECET 2024

Related News

Girl Harassment

వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Kakinada Girl  సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే… ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి,

  • Israel-US-Iran War

    ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం.. సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd