Brs Party
-
#Speed News
Minister Ponnam: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి పొన్నం
Minister Ponnam: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. అక్కన్నపేటలో పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేసిందన్నారు. ఆరోగ్య బీమా పథకం కింద పేదలు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం పొందవచ్చని వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, […]
Date : 01-05-2024 - 1:14 IST -
#Speed News
Brs Party: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి : ఎర్రోళ్ల
Brs Party: బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మార్పు అంటే కరెంటు కోతలు,రైతుల ఆత్మహత్యలు అని ఫైర్ అయ్యారు. వంద సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టను కాంగ్రెస్ దెబ్బతీసిందని, ఉస్మానియా యూనివర్సిటీకి కరెంటు,నీళ్లు ఇవ్వలేము విద్యార్థులు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని ఎర్రోళ్ల అన్నారు. మహబూబ్ నగర్ లో కేసీఆర్ బస చేస్తే కరెంటు పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి […]
Date : 30-04-2024 - 8:31 IST -
#Speed News
Osmania University: ఓయూలో నీటికి కటకట.. కాంగ్రెస్ పాలన పై బీఆర్ఎస్ నేత ఫైర్
Osmania University: కరెంటు, తాగు నీటి కొరత ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులను ఖాళీ చేసి పంపించడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగు నీటి కొరత ఉందని ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వందేళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చీకటి రోజు వచ్చాయని, కరెంటు కొరత నీళ్ల కొరత ఉందని విద్యార్థులను పంపించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని ఆయన అన్నారు. […]
Date : 29-04-2024 - 2:39 IST -
#Speed News
Kaushik Reddy: హరీష్ రావు రాజీనామాకు రెడీ.. రేవంత్ రెడీయా?: కౌశిక్ రెడ్డి
Kaushik Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆగస్టు 15 తేదీలోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏ పద్ధతిలో రాజీనామా చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని, హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజీనామా చేయించడానికి సిద్ధమా అని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు. శనివారం కరీంనగర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం మాట్లాడారు. […]
Date : 27-04-2024 - 7:54 IST -
#Speed News
BRS Party: ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ ను కలిసిన BRS నేతలు
BRS Party: ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ ను BRS నేతలు కలిశారు. బీజేపీ అదిలాబాద్ ఎంపి అభ్యర్థి గోడం నగేష్, రిటర్నింగ్ అధికారి రాజశ్రీ షా, ఐఏఎస్ పై BRS నేతలు దాసోజు, ఆశిష్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో పూర్తిగా ఫిలప్ చేయలేదని RO కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని సీఈఓ కు తెలిపారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి రిటర్నింగ్ అధికారి, రాజశ్రీ షా, ఐఏఎస్ పై చర్యలు తీసుకోవాలని సీఈఓ […]
Date : 27-04-2024 - 6:34 IST -
#Speed News
KCR Entered Social Media: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్..!
ఇప్పటివరకు సోషల్ మీడియా అకౌంట్ వాడని కేసీఆర్ తాజాగా ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Date : 27-04-2024 - 1:08 IST -
#Telangana
KCR: ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బిఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం: కేసీఆర్
KCR: దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికిచేర్చిన తెలంగాణ అస్తిత్వ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (నాటి తెలంగాణ రాష్ట్ర సమితి) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి ,పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించడం లో పార్టీ కీలక భూమిక పోషించిందన్నారు. తద్వారా తెలంగాణ దేశం గర్వించే రాష్ట్రంగా […]
Date : 26-04-2024 - 11:31 IST -
#Speed News
BRS Party: అమరవీరుల స్థూపాన్ని తాకే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు: ఎర్రోళ్ల
BRS Party: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ..ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను 100 అమలు చేస్తాం అని చెప్పారని, ఆనాటి పిసిసి అధ్యక్షుడు గా నేటి ముఖ్యమంత్రి రేవంత్ డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. అనేక హామీలు 6 గ్యారెంటీ లు అమలు చేస్తాం అన్నారని, 26వ తేదీ నాడు నేను రాజీనామా లేఖతో […]
Date : 26-04-2024 - 4:57 IST -
#Telangana
KTR: రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ నేతలకు కేటీఆర్ ముఖ్య సూచనలు
KTR: బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలలో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, […]
Date : 26-04-2024 - 4:32 IST -
#Speed News
Jeevan Reddy: ఆర్మూర్ లోనే లక్ష మెజార్టీ.. నిజామాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ దే: జీవన్ రెడ్డి
Jeevan Reddy: ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల మెజార్టీ ఇచ్చి నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు అఖండ విజయం చేకూరుస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ విజయాన్ని కాంక్షిస్తూ ఆర్మూర్ లో గురువారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ […]
Date : 25-04-2024 - 4:20 IST -
#Telangana
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించిన నల్లగొండ రైతులు
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించారు నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు. ఐకేపీ సెంటర్ కాంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేశారు రైతులు. ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడు నది ఎండాకాలం కుడా నీళ్లు మతల్లు దునికేవని, మీరు ఉన్నప్పుడే అప్పుడే మంచిగుండే సార్.. మల్లా మీ పాలనే రావాల”ని నినాదాలు చేశారు. […]
Date : 24-04-2024 - 8:44 IST -
#Telangana
Jeevan Reddy: కేంద్రంలో మోడీయిజం.. తెలంగాణలో రేవంత్ రౌడీయిజం
Jeevan Reddy: చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదని ఆయన చిల్లర మల్లర రేవంత్ రెడ్డి అనిబీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. నిజామాబాద్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెసోళ్లు మోసగాళ్లకు మోసగాళ్ళుఅని మండిపడ్డారు. నిన్న నిజామాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలను ఏమార్చే అబద్దాలు చెప్పారన్నారు. నాలుగు నెలల క్రితం అధికారంలోకి రాగానే అదిస్తాం, ఇదిస్తాం అని చెప్పి మోసగించిన రేవంత్ రెడ్డి […]
Date : 24-04-2024 - 12:05 IST -
#Speed News
Kaushik Reddy: చేనేతల కష్టాలు వింటే గుండె బరువెక్కుతుంది: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Kaushik Reddy: చేనేతల పరిస్థితి చూస్తే మనసు చెల్లించిపోతుందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అన్నారు అన్నారు. మంగళవారం జమ్మికుంట లోని చేనేత సొసైటీ పర్యవేక్షణలో భాగంగా ఆయన మాట్లాడారు. జమ్మికుంట లోని చేనేత సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షల స్టాక్ మిగిలి ఉందని దీంతోపాటు హుజరాబాద్ నియోజకవర్గం లో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో […]
Date : 23-04-2024 - 3:34 IST -
#Speed News
Koppula: కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఫైర్.. హామీల అమలుపై నిలదీత
Koppula: పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ కొప్పుల మాట్లాడారు. ‘‘ప్రజలను వంచించి పెద్ద ఎక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిజం చెబితే నమ్మరు అని, అబద్ధం చెప్తే నే నమ్ముతారు అని స్వయం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం మారితే ప్రజలు మేలు జరుగుతుందని అనుకున్నారు కాని ఇప్పుడు […]
Date : 21-04-2024 - 5:37 IST -
#Telangana
KTR: చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం- కేటీఆర్
KTR: నంది నగర్ లోని కెసిఆర్ నివాసంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డ పైన మరొక్కసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల […]
Date : 20-04-2024 - 10:36 IST