HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >We Will Fight On The Problems Of The Unemployed Enugula Rakesh Reddy

BRS Party: నిరుద్యోగుల సమస్యల పై పోరాడుతాం : ఏనుగుల రాకేష్ రెడ్డి

  • Author : Balu J Date : 26-06-2024 - 9:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rakesh
Rakesh

BRS Party: నిరుద్యోగుల సమస్యల పై గత మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ నాయక్ ను గాంధీ హాస్పిటల్ కి వెళ్లి, కలిసి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, తన పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది. తన దీక్షకు BRS అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇవ్వడం జరిగిందని BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు.

ప్రజా పాలన పేరుతో మూడొద్దులు మురిపించి పాలన అటుకెక్కించారు. విద్యార్థులు, నిరుద్యోగులు గత 4 నెలలుగా అనేక సమస్యల మీద ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేసినా పట్టింపు లేదు. గురుకుల టీచర్లు, నర్సులు మంత్రుల, ముఖ్యమంత్రి ఇళ్ళముందు పడిగాపులు కాస్తున్న సోయి లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. హరీష్ రావు గారు ప్రభుత్వానికి లేఖ రాసినా కనీస స్పందన లేదు’’ అని ఆయన అన్నారు.

డిమాండ్స్ :-

1. గ్రూప్ 1కు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలి.

2. గ్రూప్ 2కు 2 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మీ మాట నిలబెట్టుకోవాలి.

3. గురుకుల టీచర్లను వెంటనే నియమించాలి.

4. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలిస్తామని, జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలలైనా జాబ్ కేలండర్ ఎందుకివ్వలేదు? ఆ హామీని నిలబెట్టుకోవాలి.

5. కనీసం 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలి.

6. జీవో 46 ను రద్దు చెయ్యాలి. సూపర్ న్యూమరికల్ పోస్ట్ ల ద్వారా జీవో 46 బాధితులకు న్యాయం చెయ్యాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • hard comments
  • unemployed

Related News

Karimnagar Mayor As Kolagani Srinivas

కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

Karimnagar Mayor  పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన కరీంనగర్ కార్పొరేషన్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది.  కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది. బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ ప

    Latest News

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

    • ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

    • భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్‌లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!

    • స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియా.. తదుపరి లక్ష్యం నెదర్లాండ్స్‌తో పోరు!!

    • ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

      • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

      • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd