Zaheer Khan: మరోసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న జహీర్ ఖాన్.. ఈ సారి ఏ టీమ్ అంటే..?
జహీర్ ఖాన్ టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ అవుతాడని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అతని స్థానంలో మోర్కెల్‌ను టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమించారు.
- By Gopichand Published Date - 07:15 AM, Tue - 20 August 24

Zaheer Khan: టీమ్ ఇండియా గ్రేట్ ఫాస్ట్ మాజీ బౌలర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) మరోసారి ఐపీఎల్‌లో పునరాగమనం చేయనున్నాడు. రాబోయే కాలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్- జహీర్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ చర్చలు సఫలమైతే జహీర్ ఖాన్.. గౌతమ్ గంభీర్ స్థానంలో జట్టుకు మెంటార్‌గా మారవచ్చు. అంతేకాకుండా జట్టులో బౌలింగ్ కోచ్‌గా కూడా చూడవచ్చు. మోర్నీ మోర్కెల్ ఇప్పుడు టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మారాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోచింగ్ స్టాఫ్‌లో ఒక పోస్టు ఖాళీ అయింది.
జహీర్ ఖాన్‌కు కోచింగ్‌లో మంచి అనుభవం ఉంది
జహీర్ ఖాన్ టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ అవుతాడని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అతని స్థానంలో మోర్కెల్‌ను టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమించారు. ఐపీఎల్‌లో కోచింగ్‌గా పనిచేసిన అనుభవం జహీర్‌ఖాన్‌కు ఉంది. ఢిల్లీకి కోచ్‌గా, కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇది కాకుండా జహీర్ ఖాన్.. ముంబై ఇండియన్స్‌తో కూడా పనిచేశాడు.
Also Read: Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం..నీటిలో కొట్టుకుపోయిన పలు వాహనాలు
జహీర్ ఖాన్ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ 2017లో ఆడాడు
జహీర్ ఖాన్ భారత్ తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇది కాకుండా అతను 100 ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. IPLలో జహీర్ ఖాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్రస్తుతం ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ జట్లలో భాగంగా ఉన్నాడు. అతను 2017లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.
We’re now on WhatsApp. Click to Join.
లక్నో జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. అయితే అంతకుముందు 2022, 2023లో జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. తొలి ఐపీఎల్ టైటిల్ కోసం ఆ జట్టు ఇంకా ఎదురుచూస్తోంది