Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం..నీటిలో కొట్టుకుపోయిన పలు వాహనాలు
షాప్స్ ముందు పార్కింగ్ చేసిన బైక్స్ వరదలో కొట్టుకుపోయాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే వంతెన వద్ద నీటిలో బస్సు చిక్కుకుంది
- By Sudheer Published Date - 09:25 PM, Mon - 19 August 24

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు (Heavy Rain) వదలడం లేదు. ప్రతి రోజు వర్షం పడుతూనే ఉండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం కాగానే వర్షం పడుతుండడం తో ఆఫీస్ లకు వెళ్లిన వారు..ఇతర పనులు చేసుకొని ఇంటికి వెళ్తున్న వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు. రెండు రోజులుగా ఇదే పరిస్థితి. ఈరోజు కూడా అలాగే నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.
కుత్బుల్లాపూర్, గాజుల రామారాం, జగద్గిరిగుట్ట, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల వర్షం కురుస్తున్నది. బోయినపల్లి, ప్రగతినగర్, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, కూకట్‌పల్లి, ప్రగతినగర్, హైదర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, కోఠి, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. యూసఫ్‌గూడ, ఖైరతాబాద్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం తో రోడ్లన్నీ జలమయయ్యాయి. ఇక షాప్స్ ముందు పార్కింగ్ చేసిన బైక్స్ వరదలో కొట్టుకుపోయాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే వంతెన వద్ద నీటిలో బస్సు చిక్కుకుంది.
మరోవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం కురిసే ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆ సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తుంది.
RTC Bus Stuck in Floodwaters at Nizamabad Railway Under Bridge; Passengers Rescued Safely
In a close call, an RTC bus traveling from Warangal to Nizamabad became trapped in floodwaters at a railway underpass in Nizamabad on Monday. The bus was immobilized, unable to move… pic.twitter.com/PeET6AC8NS
— Sudhakar Udumula (@sudhakarudumula) August 19, 2024
#Hyderabad: Requesting all four wheelers to be kind to two wheelers & general public especially during heavy downpour. Go low on speed without splashing rain/drain water on others.
Heavy rains lashed Secunderabad, Hyderabad this afternoon. pic.twitter.com/P5dGmmqKpk
— @Coreena Enet Suares (@CoreenaSuares2) August 19, 2024
After heavy rain lash in #ToliChowki #Hyderabad pic.twitter.com/kTTJcwUy10
— Mubashir.Khurram (@infomubashir) August 19, 2024