Yuzvendra Chahal: భార్యతో విడాకుల వేళ చాహల్ ఆసక్తికర పోస్ట్.. దేవునికి కృతజ్ఞతలు అంటూ!
విడాకుల గురించి ఇప్పటివరకు ఈ జంట నుండి అధికారిక ప్రకటన రాలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి.
- By Gopichand Published Date - 03:52 PM, Thu - 20 February 25

Yuzvendra Chahal: భారత జట్టు స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాడు. చాహల్, అతని భార్య విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. వీటన్నింటి మధ్య చాహల్ (Yuzvendra Chahal) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పంచుకున్నాడు. అక్కడ అతను దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాహల్ స్టోరీలో ఏం రాశాడు?
చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాశాడు. “నేను లెక్కించగలిగే దానికంటే ఎక్కువ సార్లు దేవుడు నన్ను రక్షించాడు. కాబట్టి నేను రక్షించబడిన సమయాల గురించి నాకు కూడా తెలియదు అని నేను ఊహించగలను. దేవుడా, నాకు తెలియనప్పుడు కూడా ఎల్లప్పుడూ అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు. ఆమెన్ ” అని చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
Also Read: Satwiksairaj Rankireddy: బాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ ఇంట తీవ్ర విషాదం
Yuzi Chahal's Instagram story. pic.twitter.com/mlEGpPOLLO
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు
విడాకుల గురించి ఇప్పటివరకు ఈ జంట నుండి అధికారిక ప్రకటన రాలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాల ప్రకారం.. చాహల్ విడాకులు తీసుకుంటే ధనశ్రీ వర్మకు రూ.60 కోట్ల భరణం చెల్లించాల్సి ఉంటుందని అతని అభిమానులు పేర్కొన్నారు.
చాహల్ 11 జూన్ 2016న జింబాబ్వేపై హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. అక్కడ అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఒక వికెట్ తీసుకున్నాడు. తన కెరీర్‌లో రెండో మ్యాచ్‌లో 25 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. చాహల్ ప్రదర్శనతో జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలర్‌గా చాహల్ తన ODI కెరీర్‌లోఅతను 72 మ్యాచ్‌లలో 69 ఇన్నింగ్స్‌లలో 27.13 సగటుతో 121 వికెట్లు తీశాడు. టి-20ల గురించి మాట్లాడుకుంటే.. ఈ బౌలర్ 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు తన పేరిట కలిగి ఉన్నాడు. ఒకప్పుడు T-20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా చాహలే.