Yuzvendra Chahal : విడాకుల తర్వాత ఆత్మహత్య ఆలోచనలు.. చహల్ సంచలనం
Yuzvendra Chahal : భారత క్రికెటర్ యుజవేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత తాను ఎంత మానసికంగా కష్టపడేశాడో ఇటీవల రాజ్ శమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
- By Kavya Krishna Published Date - 01:22 PM, Fri - 1 August 25

Yuzvendra Chahal : భారత క్రికెటర్ యుజవేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత తాను ఎంత మానసికంగా కష్టపడేశాడో ఇటీవల రాజ్ శమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ సమయంలో తాను రోజుకు కేవలం రెండు గంటలే నిద్రపోయేవాడినని, కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనల వరకు వెళ్లానని చెప్పాడు. “విడాకుల తర్వాత చాలా రోజుల పాటు నేను ఒత్తిడిలోనే ఉండేవాడిని. చాలా భయాందోళనతో ఉండేదాన్ని. నా స్నేహితులకు చెప్పుకున్నాను. వాళ్లే నన్ను మళ్లీ నిలబెట్టారు. నా ఆటపై కూడా ఫోకస్ పెట్టలేకపోయాను” అని చెప్పాడు చహల్.
చహల్, ధనశ్రీ 2020 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. కానీ 2022 జూన్ నుంచి వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చివరకు 2025 మార్చిలో విడాకులు తీసుకున్నారు. “సోషల్ మీడియాలో మేమిద్దరం నవ్వుతూ కనిపించాం. కానీ వాస్తవంగా మా మధ్య సమస్యలు ఉన్నాయి. ఆ ఫోటోల వెనుక చాలా బాధ ఉంది. ఆ ఫొటోలు పెట్టడానికీ నేను నన్ను నన్నే బలవంతం చేసుకున్నా” అని చెప్పాడు.
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు.. ఓటరు ముసాయిదా జాబితా విడుదల
“ఒకరి కోపానికి మరొకరు కోపంతో స్పందిస్తే ఆ రిలేషన్ సాగదు. అప్పుడు ఇద్దరూ తమ తమ దారుల్లో వెళతారు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నా లైఫ్‌లో అంగీకారం ఉండలేదని, అదే సమస్యకి కారణమైందని అనిపించింది” అని చెప్పాడు.
చహల్ మీద విడాకుల సమయంలో తప్పుడు ఆరోపణలు వచ్చాయి. “నన్ను ద్రోహి అంటున్నారు. కానీ నేను ఎప్పుడూ అలా ఏమీ చెయ్యలేదు. నేను ఎప్పుడూ మహిళల్ని గౌరవిస్తూ ఉంటాను. నా వ్యక్తిత్వాన్ని చెడుగా చూపించడం నన్ను చాలా బాధించింది” అన్నాడు.
చహల్ విడాకుల సమయంలో కోర్టుకు ‘Be Your Own Sugar Daddy’ అనే టి-షర్ట్ వేసుకువెళ్లాడు. “అదే సమయంలో ఆ టి-షర్ట్‌కి ఓ సందేశం ఉంది. ఎవరి మీదా ఆధారపడకుండా ఉండాలి. ఆర్థికంగా, భావోద్వేగంగా కూడా స్వతంత్రంగా ఉండాలి” అని చెప్పాడు.
తాజాగా కపిల్ శర్మ షోలో కూడా చహల్ తన కొత్త రిలేషన్ గురించి తెలిపాడు. షోలో క్రీష్ణా, కీకూలు సరదాగా చెప్పిన విషయం మీద నవ్వుతూ “ఇండియా ఇప్పుడు తెలిసింది” అని చహల్ స్పందించాడు.
Golconda : రూ.100కోట్లతో గోల్కొండ రోప్‌వే ప్రతిపాదనలు