చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. రెండోసారి టైటిల్ గెలిచిన మంధాన సేన!
ఇన్నింగ్స్‌లు ఛేజింగ్‌లో ఆర్సీబీ ఆరంభంలోనే గ్రేస్ హారిస్ వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో కెప్టెన్ స్మృతి మంధాన, జార్జియా వోల్ బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ 92 బంతుల్లో 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు.
- Author : Gopichand
Date : 06-02-2026 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
WPL 2026 Final: ఆర్సీబీ రెండోసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. వడోదరలోని కోటంబి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో సాధించిన ఈ అద్భుత విజయానికి లారెన్ బెల్ వేసిన మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ స్పెల్లే కారణమని బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన క్రెడిట్ ఇచ్చారు.
లారెన్ బెల్ పొదుపైన బౌలింగ్
మొదటి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడి 20 ఓవర్లలో 203/4 భారీ స్కోరు సాధించారు. ఇంత హై-స్కోరింగ్ మ్యాచ్‌లో కూడా లారెన్ బెల్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. ఆమెకు వికెట్లు దక్కకపోయినప్పటికీ తన 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4.75 ఎకానమీ రేటును నమోదు చేశారు.
Also Read: అల్లు అర్జున్ కు విలన్ గా మారబోతున్న నేషనల్ క్రాష్
బెల్‌పై ప్రశంసల జల్లు
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ సెర్మనీలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ స్మృతి మంధాన మాట్లాడుతూ.. “అవును ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ అని మాకు తెలుసు. అయితే ఫైనల్లో 200 పైచిలుకు పరుగులు ఖచ్చితంగా మంచి స్కోరే. చివరి 4 ఓవర్లలో మేము చాలా బాగా బౌలింగ్ చేశామని, పరిస్థితిని చక్కగా హ్యాండిల్ చేశామని భావిస్తున్నాను. ముఖ్యంగా లారెన్ బెల్‌ను అభినందించాలి. మ్యాచ్‌లో మొత్తం 400 పరుగులు నమోదైతే, ఆమె 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చారు. నా దృష్టిలో ఇది మ్యాచ్ విన్నింగ్ స్పెల్” అని అన్నారు.
మంధాన-వోల్ మ్యాచ్ విన్నింగ్
ఇన్నింగ్స్‌లు ఛేజింగ్‌లో ఆర్సీబీ ఆరంభంలోనే గ్రేస్ హారిస్ వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో కెప్టెన్ స్మృతి మంధాన, జార్జియా వోల్ బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ 92 బంతుల్లో 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. మంధాన 41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేయగా (స్ట్రైక్ రేట్ 212.20), వోల్ 54 బంతుల్లో 14 ఫోర్లతో 79 పరుగులు చేశారు (స్ట్రైక్ రేట్ 146.30).
వోల్ కష్టానికి దక్కిన ఫలితం
జార్జియా వోల్ గురించి మంధాన మాట్లాడుతూ.. నెట్స్‌లో ఆమె పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు. “వోల్ మాకు సరైన దిశను చూపింది. పవర్‌ప్లేలో దాదాపు స్ట్రైక్ అంతా ఆమె దగ్గరే ఉంది. కానీ ఆమె ఇంటెంట్ (సంకల్పం) అద్భుతంగా ఉంది. ఫైనల్లో వోల్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతుందని 10-15 రోజుల క్రితమే నేను అమ్మాయిలతో చెప్పాను. ఆమె తన ఆట కోసం చాలా కష్టపడుతోంది. గత రెండు మూడు రోజులుగా ఆమె ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయడం నేను చూశాను, ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది” అని స్మృతి మంధాన వివరించారు.