WPL 2024 Opening Ceremony: మహిళల ఐపీఎల్ కు కౌంట్ డౌన్.. గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీకి బీసీసీఐ ఏర్పాట్లు
మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ టోర్నీ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది.
- Author : Praveen Aluthuru
Date : 20-02-2024 - 4:41 IST
Published By : Hashtagu Telugu Desk
WPL 2024 Opening Ceremony: మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ టోర్నీ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తోంది. రెండో సీజన్ కోసం ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. బాలీవుడ్ తారలతో ఆరంభ వేడుకలు ప్లాన్ చేసింది. ప్రముఖ నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రారంభ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నారు. కార్తీక్ ఆర్యన్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేయనున్నారు. గత ఏడాది కియారా అద్వానీ, కృతిసనన్ వంటి స్టార్స్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ లతో అలరించారు.
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ మార్చి 17 వరకు జరగనుంది. గతేడాది మాదిరిగానే మొత్తం ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండే జట్టు నేరుగా ఫైనల్‍కు చేరుకోనుండగా రెండు, మూడు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఎలిమినేటర్ గెలిచే జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారత సారథి హర్మన్ ప్రీత్ కౌర్, ఢిల్లీకి ఆస్ట్రేలియా ప్లేయర్ మెగ్ లానింగ్, గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆసీస్ స్టార్ బెత్ మూనీ, రాయల్ చాలెంజర్స్ జట్టుకు టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, యూపీ వారియర్స్ టీమ్‍కు ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హేలీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే గత సీజన్ ఒకే వేదికలో నిర్వహిస్తే…ఈ సారి బెంగళూరు, ఢిల్లీల్లో టోర్నీ నిర్వహిస్తున్నారు..
టోర్నీలో తొలి 11 మ్యాచ్‌లు బెంగళూరులో జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్ లకు ఢిల్లీ ఆధిత్యమిస్తోంది. ఫైనల్ మార్చి 17న జరగనుంది.
Also Read: Hyderabad City Police: కుమారి ఆంటీని ఫాలో అయిన పోలీసులు