Messi Cut-Out: నది మధ్యలో మెస్సీ కటౌట్.. ఎక్కడంటే..?
FIFA వరల్డ్ కప్ ఫీవర్ ఫుట్‌బాల్ అభిమానులను పట్టి పీడిస్తున్న వేళ..
- By Gopichand Published Date - 12:57 PM, Thu - 3 November 22
FIFA వరల్డ్ కప్ ఫీవర్ ఫుట్‌బాల్ అభిమానులను పట్టి పీడిస్తున్న వేళ.. కేరళలోని నది మధ్యలో ఏర్పాటు చేసిన అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీ భారీ కటౌట్ ఆన్లైన్లో దృష్టిని ఆకర్షించింది. కోజికోడ్‌లోని పుల్లవూరు వద్ద కురుంగట్టు కడవు నది మధ్య 30 అడుగుల ఎత్తైన కటౌట్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నవంబర్ 20 నుంచి మొదలు కానున్న సందర్భంగా కేరళలోని పుల్లవూర్ అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్.. అర్జెంటీనా ప్లేయర్ మెస్సీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 30 అడుగుల ఎత్తైన మెస్సీ కటౌట్‌ను నది మధ్యలో నిలబెట్టారు. ఈ ఏడాది అర్జెంటీనా టీం వరల్డ్ కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ యూజర్ రిజ్వాన్ షేర్ చేసిన క్లిప్‌లో మెస్సీ అర్జెంటీనా జెర్సీని ధరించి ఉన్న కటౌట్ ను మెస్సీ అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ ట్వీట్ పై యూజర్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పుల్లవూరుకు చెందిన అర్జెంటీనా అభిమానుల సంఘం ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసినట్లు ఒన్మనోరమ కథనం పేర్కొంది. “మేము ఈ సందర్భాన్ని ఏదో ఒక ప్రత్యేకతతో గుర్తించాలనుకుంటున్నాము. మెస్సీ కాకుండా మరెవరు దీనికి అర్హులు” అని అభిమానుల సంఘం సభ్యుడు ఆశిక్ అహ్మద్ ఉటంకిస్తూ ఒన్మనోరమ ద్వారా పేర్కొన్నారు. FIFA ప్రపంచ కప్ నవంబర్ 20 న ఖతార్‌లో ప్రారంభం కానుంది. అలాగే ఈ FIFA ప్రపంచ కప్ తన చివరి ప్రపంచ కప్ అని మెస్సీ చెప్పిన విషయం కూడా తెలిసిందే.
Related News
Durga Temple: ఈ దుర్గా మాత ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తారట..! ఆ టెంపుల్ విశేషాలివే..!
దుర్గా మాత (Durga Temple) పురాతన ఆలయం కేరళలోని మలప్పురంలో ఉన్న ముత్తువల్లపర్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తుంటారు.