Test Double Centuries: టెస్టుల్లో మహిళ క్రికెటర్ల డబుల్ ధమాఖా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ టెస్టులో ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ సాధించింది.
- By Praveen Aluthuru Published Date - 07:39 AM, Mon - 26 June 23

Test Double Centuries: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ టెస్టులో ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ సాధించింది. టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. నిజానికి గత కొన్నేళ్లుగా మహిళల టెస్టు మ్యాచ్‌లు చాలా తక్కువగా జరుగుతున్నాయి. అయితే టెస్టుల్లోనూ మహిళా క్రికెటర్లు సత్తా చాటుతున్నారు.
భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 2002లో టౌంటన్‌లో 214 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్‌పై ఆడిన ఆమె కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్. ఇంగ్లండ్‌లోని పిచ్‌పై మిథాలీ 214 పరుగులు చేసింది.
2017లో సిడ్నీలో జరిగిన మహిళల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ డబుల్ సెంచరీ చేసింది. సిడ్నీలో ఇంగ్లండ్ కేవలం 280 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా 448/9తో ఆకట్టుకుంది. పెర్రీ అజేయంగా 213 పరుగులు చేశాడు.సాధించింది.
ఆస్ట్రేలియా క్రికెటర్ రోల్టన్ 2001లో టాప్ స్కోరు 209 నాటౌట్ గా నిలిచింది.
Read More: Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో వింత ఘటన