HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Will It Be Difficult To Stop Mumbai Now

IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

ఐపీఎల్ చరిత్రను గమనిస్తే ముంబై ఇండియన్స్‌కు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. టోర్నీ ఆరంభంలో వరుసగా ఓడిపోతూ పాయింట్ల పట్టికలో అట్టడుగున కనిపిస్తుంది, కానీ సెకండాఫ్ వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకుని ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొస్తుంది

  • Author : Sudheer Date : 21-04-2026 - 9:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mi Team2026
Mi Team2026

ఐపీఎల్ 2026 సీజన్ ఫస్టాఫ్‌లో వరుస ఓటములతో కుదేలైన ముంబై ఇండియన్స్, సెకండాఫ్‌లో మళ్ళీ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుంది. “స్లో స్టార్టర్స్” అనే ముద్రను చెరిపేస్తూ, గుజరాత్ టైటాన్స్‌పై సాధించిన భారీ విజయం ఆ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐపీఎల్ చరిత్రను గమనిస్తే ముంబై ఇండియన్స్‌కు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. టోర్నీ ఆరంభంలో వరుసగా ఓడిపోతూ పాయింట్ల పట్టికలో అట్టడుగున కనిపిస్తుంది, కానీ సెకండాఫ్ వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకుని ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొస్తుంది. ఈ సీజన్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన హార్దిక్ పాండ్యా సేన, నిన్నటి మ్యాచ్‌లో జీటీని 99 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా టోర్నీలోని మిగతా జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది. ముంబై మళ్ళీ లయ అందుకుందంటే వారిని ఆపడం ఏ జట్టుకైనా కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తిలక్ వర్మ ఫామ్.. శాంట్నర్ ఎంట్రీతో మారిన సమీకరణాలు

ముంబై విజయానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ తిరిగి ఫామ్‌లోకి రావడం బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముకలా మారింది. ఇక బౌలింగ్ విభాగంలో యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా తన మార్క్ స్పెల్స్‌తో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెడుతున్నాడు. వీటికి తోడు, కివీస్ స్పిన్ మాంత్రికుడు మిచెల్ శాంట్నర్ జట్టులో చేరడం ముంబైకి భారీ ప్లేస్ పాయింట్‌గా మారింది. మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ రాణించగల శాంట్నర్ రాకతో జట్టు సమతుల్యత (Balance) అద్భుతంగా కుదిరింది.

రోహిత్ శర్మ వస్తే ఇక ఆపడం సాధ్యమేనా?

ప్రస్తుతం జట్టు మంచి ఊపులో ఉండగా, వెన్నునొప్పి కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ తదుపరి మ్యాచ్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రోహిత్ రాకతో ముంబై బ్యాటింగ్ పవర్ మరింత పెరుగుతుంది. అనుభవజ్ఞుడైన రోహిత్ ఓపెనింగ్‌లో మెరుపులు మెరిపిస్తే, హార్దిక్ సేనకు తిరుగుండదు. బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ ముంబై క్లిక్ అవుతుండటంతో ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి జట్లు ముంబైని తక్కువ అంచనా వేస్తే ఈసారి కూడా కప్ ముంబై ఖాతాలో పడటం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hardik Pandya MI Captaincy News
  • IPL 2026
  • IPL 2026 Mumbai Indians Comeback
  • Jasprit Bumrah Wickets in IPL 2026
  • MI
  • MI Playoff Qualification Scenarios
  • MI vs GT 99 Runs Win Highlights
  • Mitchell Santner in Mumbai Indians Squad
  • Rohit Sharma Injury Update IPL 2026
  • Tilak Varma Form IPL 2026

Related News

Krunal Pandya wins the IPL title for the fifth time.

Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో కృనాల్ తన కెరీర్ లో ఐదో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో చేరాడు. దిగ్గజాల సరసన కృనాల్ ఐపీఎల్ లో అత్యధిక టైటిళ

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd