HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >We Went To The Dressing Room Expecting A Handshake Salman Agha

IND VS PAK: షేక్‌హ్యాండ్ ఇస్తార‌ని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం: స‌ల్మాన్ ఆఘా

  • Author : Vamsi Chowdary Korata Date : 02-05-2026 - 3:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Salman Ali Agha has broken his silence on the handshake controversy
Salman Ali Agha has broken his silence on the handshake controversy

గతేడాది ఆసియా కప్ సందర్భంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య చోటుచేసుకున్న ‘హ్యాండ్‌షేక్ వివాదం’ క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయ‌ం తెలిసిందే. పహల్గామ్ దాడుల నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు జాతీయ భావనకు అనుగుణంగా వ్యవహరించింది. అయితే, ఈ వివాదంపై పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ అలీ ఆఘా తాజాగా స్పందిస్తూ, అప్పుడు తెర వెనుక ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరించాడు. అతడి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Salman Ali Agha relieved about India vs Pakistan handshake controversy:

Before the match, there was a press conference and a trophy shoot, and there was a handshake there too. So when I was going for the toss, I was pretty normal. I said, “Obviously, I had an idea that things… pic.twitter.com/zImpcx7pG1

— TEJASH (@Tejashyyyyy) May 2, 2026

ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉందని ఆఘా గుర్తుచేశాడు. “టాస్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్, ట్రోఫీ షూట్ సమయంలో మేం షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నాం. టాస్ వేయడానికి వెళుతున్నప్పుడు నేను మామూలుగానే ఉన్నాను. అయితే, వాతావరణం సాధారణంగా ఉండదని నాకు తెలుసు. కానీ, ఏకంగా షేక్‌హ్యాండ్ కూడా ఉండదని నేను ఊహించలేదు” అని ఆఘా తెలిపాడు.

“మా మీడియా మేనేజర్‌తో కలిసి టాస్ కోసం వెళుతున్నప్పుడు, మ్యాచ్ రిఫరీ నన్ను పక్కకు పిలిచి ‘ఈసారి షేక్‌హ్యాండ్ ఉండదు, దయచేసి గమనించండి’ అని చెప్పారు. దానికి నేను ‘సరే, షేక్‌హ్యాండ్ లేకపోతే నాకేం ఫర్వాలేదు. నాకేమీ పెద్ద ఆసక్తి లేదు’ అని బదులిచ్చాను. ఈ విధంగా నాకు ముందే సమాచారం అందింది” అని ఆఘా వివరించాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. మ్యాచ్‌కు ముందు షేక్‌హ్యాండ్ ఉండదని తెలిసినప్పటికీ, మ్యాచ్ తర్వాత అయినా కరచాలనం ఉంటుందని ఆఘా భావించాడు. “మ్యాచ్ ముగిశాక, మేం ఓడిపోయాం. షేక్‌హ్యాండ్ ఇవ్వడం కోసం మా జట్టు మొత్తం భారత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాం. కానీ అప్పటికీ వారు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మేము వెళ్లేసరికి వారి డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసి ఉన్నాయి” అని ఆఘా ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇలాంటి ఘటనలు క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని, కింది స్థాయి క్రీడపై చెడు ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశాడు. “మనం ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు మనల్ని గమనిస్తుంటారు. వాళ్లు మన నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలి. రేపు ఏదైనా క్లబ్ గేమ్‌లో ఇలాంటిదే జరిగితే, దానికి పరోక్షంగా నేను కూడా కారణమవుతాను. రోల్ మోడల్స్‌గా ఉన్నప్పుడు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు” అని ఆఘా వ్యాఖ్యానించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup
  • dressing room
  • India-Pakistan handshake row
  • No Handshake
  • Salman Ali Agha
  • Sportsmanship
  • Suryakumar Yadav

Related News

2007, 2024, 2026 MS Dhoni, Suryakumar Yadav and Rohit Sharma together T20 world cup capitans

T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్‌లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.

టీమిండియాకు మూడు టీ 20 వరల్డ్‌కప్ టైటిళ్లను అందించిన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ముగ్గురు లెజెండరీ కెప్టెన్లు తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ముగ్గురూ ఫొటో దిగారు. సూర్యకుమార్ యాదవ్‌ను మధ్యలో ఉంచి ధోనీ, రోహి

  • Riyan Parag

    ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

Latest News

  • Tamilanadu : విజయ్ కు ఇళయరాజా సపోర్ట్?

  • 10th Result : ఒక్క మార్కుతో ఫెయిల్.. ఏపీలో 10 తరగతి విద్యార్థిని సూసైడ్

  • Tamil Nadu Exit Poll Results : ఎలక్షన్స్ రిజల్ట్స్ వేళ త్రిష పోస్ట్ వైరల్

  • Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ పై ఐటీ శాఖ ఫోకస్

  • TRS : కేసీఆర్ పై మాట మార్చిన కవిత..!!

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd