HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Watch Fan Bows Down In Front Of Ms Dhoni

MS Dhoni Fan: ధోనీ కోసం గ్రౌండ్‌లోకి వ‌చ్చిన అభిమాని.. కెప్టెన్ కూల్ ఏం చేశాడంటే, వీడియో..!

ఐపీఎల్ 2024లో గత రాత్రి అంటే మే 10వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

  • By Gopichand Published Date - 09:38 AM, Sat - 11 May 24
  • daily-hunt
MS Dhoni Fan
Safeimagekit Resized Img 11zon

MS Dhoni Fan: ఐపీఎల్ 2024లో గత రాత్రి అంటే మే 10వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జీటీ 35 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK కేవలం 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అజేయ ఇన్నింగ్స్ ఆడినా తన జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. ఇంతలో లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అభిమాని ధోనిని (MS Dhoni Fan) కలిసేందుకు మైదానం మధ్యలోకి చేరుకుని ధోని పాదాలపై పడ్డాడు. అయితే కెప్టెన్ కూల్ అతడిని పైకి లేపి కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ పరుగులను ఛేదించలేక‌పోయింది. ఈ సమయంలో ఆ జట్టు 35 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతను తన జట్టును గెలిపించలేకపోయాడు. కానీ అతను తన బ్యాటింగ్‌తో మళ్ళీ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. నిజానికి రెండో ఇన్నింగ్స్‌లో చివరి 3 బంతులు మిగిలి ఉండగానే ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని అభిమాని మైదానం మధ్యలోకి వ‌చ్చి ధోనీ కాళ్లపై పడ్డాడు. అయితే ధోనీ అతడిని కాళ్లపై నుంచి లేపి కౌగిలించుకున్నాడు.

Also Read: Barron Trump : పొలిటికల్ ఎంట్రీపై ట్రంప్ చిన్న కొడుకు యూటర్న్.. ఎందుకు ?

మొదటి అభిమానిని చూసి ఎంఎస్ ధోని సరదాగా పారిపోవడం ప్రారంభించడం మీరు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఆ తర్వాత అతనే ఫ్యాన్ వైపు వెళ్లి ఆప్యాయంగా ప‌ల‌కరించాడు. ఈ స‌మ‌యంలోనే ఫ్యాన్ కెప్టెన్ కూల్ కాళ్ల‌పై ప‌డ‌తాడు. కానీ ధోని ఇది చూడలేక అతనిని పైకి లేపి కౌగిలించుకున్నాడు. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు కూడా ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join

Best moments of IPL 🥹💛
That Hug and That smile
Mahi The Man The Myth The Legend 🥰 Demi God for Millions of Indians 🇮🇳 Ms Dhoni 🐐 #DHONI𓃵#ChennaiSuperKings#CSKvGT #Ahmedabad #TATAIPL2024 #T20WorldCup2024 pic.twitter.com/m8MA8YdKzh

— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) May 11, 2024

GT vs CSK మ్యాచ్ ఇలా జరిగింది

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. గిల్ 104, సుదర్శన్ 103 పరుగులు చేశారు. బ‌దులుగా 20 ఓవర్లలో CSK 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు తరఫున డారిల్ మిచెల్, మోయిన్ అలీ అర్ధ సెంచరీలు చేశారు. ఇది కాకుండా ధోని కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ జట్టు 35 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai Super Kings
  • CSK vs GT
  • IPL
  • ipl 2024
  • MS Dhoni Fan
  • MS Dhoni Viral Video

Related News

    Latest News

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd