HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Warner Embarrasses Pakistani Cricketers At Psl Press Conference

David Warner: పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో పాక్ క్రికెటర్ల పరువు తీసిన వార్నర్

  • Author : Vamsi Chowdary Korata Date : 26-03-2026 - 10:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
David Warner
David Warner

PSL 2026  పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలు రాజుకున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన కెప్టెన్ల రౌండ్ టేబుల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కరాచీ కింగ్స్ సారథి డేవిడ్ వార్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొన్న ఈ సమావేశంలో క్రమశిక్షణ లోపించిందంటూ ఆయన బహిరంగంగానే మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే.. ప్రెస్ మీట్‌లో వార్నర్ తన జట్టు వ్యూహాల గురించి సీరియస్‌గా వివరిస్తుండగా.. పక్కనే కూర్చున్న ఇతర జట్ల కెప్టెన్లు షాహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ ఒకరితో ఒకరు సరదాగా ముచ్చటించుకుంటూ నవ్వుకుంటున్నారు. తన మాటలను వారు పట్టించుకోకపోవడంతో వార్నర్ సహనం కోల్పోయారు. “ఇక్కడ ఏం జరుగుతోంది? క్షమించండి.. ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు ఉన్నట్లున్నారు. వీళ్లు తమను తాము ‘ప్రీమియం ప్లేయర్స్’ అని పిలుచుకుంటున్నారు కానీ, వీరి ప్రవర్తన మాత్రం చిన్న పిల్లల్లా ఉంది. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎలా ఉండాలో కూడా వీరికి తెలియదా?” అంటూ ఘాటుగా విమర్శించారు.

వార్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పాక్ క్రికెట్ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవైపు వార్నర్ పద్ధతిని కొందరు తప్పుబడుతుండగా, మరికొందరు మాత్రం అంతర్జాతీయ ప్రెస్ మీట్లలో ప్రొఫెషనలిజం ఉండాల్సిందేనని వార్నర్‌కు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా వార్నర్ లాంటి సీనియర్ ప్లేయర్ మాట్లాడుతున్నప్పుడు తోటి ఆటగాళ్లు గౌరవం ఇవ్వకపోవడం సరైనది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • Cricketor David Warner
  • Karachi Kings
  • Mohammad Rizwan
  • Pakistan Cricket
  • Pakistan Super League
  • Press Conference
  • PSL 2026
  • Saud Shakeel
  • Shaheen Afridi

Related News

Pakistan Super League

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌.. ప్రేక్ష‌కుల‌కు నో ఎంట్రీ!

పీఎస్ఎల్ 2026 ప్రారంభంలో ముల్తాన్, పెషావర్, ఫైసలాబాద్, కరాచీ, రావల్పిండి, లాహోర్‌లలో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు కేవలం కరాచీ, లాహోర్ మాత్రమే ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

    Latest News

    • Peddi Tickets : పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్

    • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    • Andhra Pradesh Assembly And Lok Sabha Seats: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు..?

    • Tamil Nadu Election 2026 : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

    • Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

    Trending News

      • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

      • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

      • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

      • పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

      • రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd