HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Jasprit Bumrah Rested For Westindies T20 Series

India T20 Squad WI Tour:కోహ్లీ, బూమ్రాలకు రెస్ట్…విండీస్ తో టీ ట్వంటీలకు భారత్ జట్టు ఇదే

కరేబియన్ టూర్ లో టీ ట్వంటీ సీరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. అంతా ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు.

  • Author : Naresh Kumar Date : 14-07-2022 - 3:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jasprit Bumrah
Jasprit Bumrah

కరేబియన్ టూర్ లో టీ ట్వంటీ సీరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. అంతా ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. ఇంగ్లాండ్ టూర్ లో టెస్ట్ , టీ ట్వంటీ సీరీస్ ఆడిన కోహ్లీ ఇంకా ఫామ్ లోకి రాలేదు. గాయం కారణంగా వన్డే సీరీస్ ఆడడం లేదు. అయితే విండీస్ టూర్ నుంచీ రెస్ట్ కావాలని కోహ్లీ ముందే బీసీసీఐకి రిక్వెస్ట్ చేసాడు. అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో అతడు ఉన్నాడని సెలక్టర్లు ధ్రువీకరించారు. అలాగే ఇంగ్లాండ్ టూర్ లో అదరగొడుతున్న బూమృకు కూడా రెస్ట్ ఇచ్చారు.
గాయాల నుంచి కోలుకున్న కేఎల్‌ రాహుల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ పునరాగమనం చేసారు. జర్మనీ లో సర్జరీ చేయించుకుని వచ్చిన రాహుల్ ఫిట్ నెస్ సాధిస్తేనే కరేబియన్ టూర్ కు వెళ్లనున్నాడు. ఇప్పటికే రాహుల్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. దాదాపు ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ అశ్విన్ కు చోటు కల్పించింది.
విండీస్‌తో వన్డే సిరీసుకు గత వారమే టీమ్‌ఇండియాను ప్రకటించారు. శిఖర్‌ ధావన్‌ జట్టును నడిపిస్తాడని సెలక్టర్లు ప్రకటించారు. రవీంద్ర జడేజా అతడికి డిప్యూటీగా ఉంటాడని పేర్కొన్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా, రిషభ్ పంత్‌, షమి, హార్దిక్‌ పాండ్యకు రెస్ట్‌ ఇచ్చారు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీసు జులై 29 నుంచి మొదలై ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్‌ కీట్స్‌లోని వార్నర్‌ పార్క్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.

విండీస్ టూర్ కు భారత టీ20 జట్టు :
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India vs west indies
  • Jasprit Bumrah
  • KL Rahul
  • kuldeep yadav
  • T20 series
  • virat kohli

Related News

    Latest News

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

    • ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

    • భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్‌లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!

    • స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియా.. తదుపరి లక్ష్యం నెదర్లాండ్స్‌తో పోరు!!

    • ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

      • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

      • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd