Kohli Strike Rate: కోహ్లీపై విమర్శకులకు ఇచ్చి పడేసిన ఏబీడీ
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20 ఫార్మాట్‌కు తన స్ట్రైక్‌రేట్ సరిపోదని కొందరు మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటికే 500 పరుగులు చేశాడు. బెంగళూరు భారీ స్కోరు చేయడంలోనూ కీలకపాత్ర పోషించాడు
- By Praveen Aluthuru Published Date - 11:22 AM, Fri - 3 May 24

Kohli Strike Rate: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20 ఫార్మాట్‌కు తన స్ట్రైక్‌రేట్ సరిపోదని కొందరు మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటికే 500 పరుగులు చేశాడు. బెంగళూరు భారీ స్కోరు చేయడంలోనూ కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ఆర్సీబీ దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కోల్పోయింది. దీంతో విరాట్ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటం వల్లే ఇదంతా జరిగిందని విమర్శకులు అంటున్నారు. ఇలాంటి వాటికి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, కోహ్లీ ప్రాణ స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఘాటైన సమాధానం ఇచ్చాడు.
ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడన్నాడు ఎబిడి. అతని స్ట్రైక్ రేట్ పై తీవ్ర విమర్శలు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. టోర్నీ మొదలైనప్పటి నుంచి ఇవే మాటలు విని విసిగిపోయా. ఈ విమర్శలకు నేను గట్టిగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ ఒకడు. ఆయన గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. కానీ అతని స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు చేస్తున్న కొందరు క్రికెట్ పండితులు కోహ్లీ ఆడిన మ్యాచ్‌ల్లో కనీసం సగం కూడా ఆడలేదు. వారికి ఆటపై సరైన అవగాహన లేదని నేను భావిస్తున్నాను. అసలు ఎన్ని మ్యాచ్‌లు ఆడారు? ఐపీఎల్‌లో మీరు ఎన్ని సెంచరీలు సాధించారు? అని ఏబీడీ ఘాటుగా ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇదిలా ఉంటె ఐపీఎల్ తర్వాత టీమిండియా టి20 ప్రపంచకప్ ఆడనుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ గెలిచే అవకాశం తృటిలో చేజారింది. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి చివరి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అయితే విదేశీ గడ్డపై ఈ మెగా టోర్నీ రోహిత్, విరాట్‌లకు అసలైన అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే నెక్స్ట్ ఐసీసీ ప్రపంచకప్ కు వీరిద్దరూ ఉంటారో లేదో డౌటే. అందుకే ఈ సారి ఈ స్టార్ బ్యాట్స్ మెన్స్ ఫ్యాన్స్ కోసమైనా ఈ ప్రపంచకప్ గెలవాలి. పవర్ ప్లేలో రోహిత్ , ఆ తర్వాత విరాట్ దానిని కొనసాగిస్తే టీమిండియాకు విజయం పెద్ద కష్టమేమి కాదు.
Also Read: Viveka Murder Case : అవినాష్ రెడ్డి కి భారీ ఊరట