Virat Kohli Flying Kiss: ఎంత ఘాటు ప్రేమయో.. భార్య అనుష్కకు కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు!
క్రికెట్ (Cricket) స్టేడియంలోని రొమాంటిక్ ముద్దులు, కొంటె చూపులతో హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు.
- By Balu J Published Date - 12:03 PM, Mon - 24 April 23

స్టార్ బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ (Anushka Sharma) ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సమయం వచ్చినప్పుడు కోహ్లీ అనుష్కపై, అనుష్క కోహ్లీపై ప్రేమను ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అందుకే ఈ జంటను ఇండియా బెస్ట్ కపుల్ అని వాళ్ల అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. ఇంట్లోనే కాదు.. క్రికెట్ (Cricket) స్టేడియంలోని రొమాంటిక్ ముద్దులు, కొంటె చూపులతో హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.
తాజాగా విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ ను అద్భుతమైన క్యాచ్ తో ఔట్ చేశాడు.యశస్వి క్యాచ్ ని కోహ్లీ అందుకున్న తర్వాత స్టాండ్స్ లో ఉన్న భార్య అనుష్క వైపుకి ఫ్లయింగ్ కిస్ (Flying Kiss) ని విసిరి సెలబ్రేట్ చేసుకున్నాడు. క్యాచ్ అందుకున్న కోహ్లీని ఉత్సాహపర్చే విధంగా అనుష్క నిల్చుని చప్పట్లు కొడుతూ ఉండగా కోహ్లీ ముద్దు విసరడంతో సిగ్గు పడుతూ నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral) అవుతోంది.
https://youtu.be/ku3ut3B5NwQ
Also Read: Pregnancy Test: అమ్మాయిలకు గర్భస్థ పరీక్షలు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు!