HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Breaks Record Against Csk

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు!

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభం లభించింది.

  • Author : Gopi Date : 05-04-2026 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli

Virat Kohli: ఆర్​సీబీ దిగ్గజ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఎప్పుడు మైదానంలోకి దిగినా ఏదో ఒక రికార్డును తన పేరిట ఖాయంగా లిఖించుకుంటున్నాడు. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటిదే ఒకటి చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికీ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఒక పెద్ద రికార్డును మాత్రం బద్దలు కొట్టాడు. సీఎస్‌కేపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు.

రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 2 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీ చేసిన మొత్తం పరుగులు 1174కు చేరుకున్నాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఏదైనా ఒక నిర్దిష్ట ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పుడు విరాట్ కోహ్లీ సొంతమైంది.

Also Read: హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

అంతకుముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. ‘హిట్‌మ్యాన్’ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 1161 పరుగులు చేశారు. ఇప్పుడు రోహిత్ ఈ విషయంలో వెనుకబడ్డాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో కూడా విరాట్ కోహ్లీయే కనిపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ ఇప్పటివరకు 1159 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ కూడా పంజాబ్ కింగ్స్‌పైనే 1134 పరుగులు సాధించాడు.

ఆర్​సీబీ బ్యాటర్ల జోరు

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభం లభించింది. కోహ్లీ భాగస్వామి ఫిల్ సాల్ట్ 30 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఇక మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా 29 బంతుల్లో కీలకమైన 50 పరుగులు జోడించాడు.

చివర్లో కెప్టెన్ రజత్ పాటిదార్ 19 బంతుల్లో 6 భారీ సిక్సర్లతో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లోనే 8 సిక్సర్లతో 70 పరుగులు బాదాడు. వీరిద్దరి మెరుపు దాడి కారణంగా ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CSK
  • Kohli Records
  • RCB vs CSK
  • rohit sharma
  • sports news
  • virat kohli

Related News

BCCI refutes reports regarding Rohit Sharma's retirement.

Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను ఖండించిన బీసీసీఐ

భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్ ముగింపునకు సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకు తెరదించింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కాబోతోందంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ వా

  • Rohit Sharma's retirement...?

    Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌..? ఇంగ్లాండ్‌తో చివరి వన్డే

  • India's first ODI against England today... 'Ro-Ko' mania begins again.

    Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే నేడు.. రో– కో మ్యానియా మళ్లీ స్టార్ట్

Latest News

  • Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. !!

  • Wife Killed Husband : ఆరు నెలల్లో దేశంలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు చనిపోయారో తెలుసా ?

  • CJP ‘Chalo Parliament’ : రేపు CJP ‘ఛలో పార్లమెంట్’.. ఢిల్లీలో హైఅలర్ట్

  • UP : గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

  • J&K Cloudburst Tragedy: జమ్మూలో ప్రకృతి బీభత్సం.. 15 మందికిపైగా మృతి

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd