SRH Bowling Coach: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆటగాడు!
వరుణ్ ఆరోన్ తన కెరీర్‌లో మొత్తం 52 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 50 ఇన్నింగ్స్‌లలో 44 వికెట్లు సాధించాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం.
- By Gopichand Published Date - 07:30 PM, Mon - 14 July 25

SRH Bowling Coach: ఐపీఎల్ 2026 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా (SRH Bowling Coach) వరుణ్ ఆరోన్‌ను నియమించింది. ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లలో కామెంటరీ, విశ్లేషకుడిగా కనిపిస్తున్న వరుణ్ ఆరోన్ గత రెండు సీజన్లుగా ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న న్యూజిలాండ్‌కు చెందిన జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. హైదరాబాద్ ఫ్రాంచైజీ జులై 14న సోషల్ మీడియా ద్వారా వరుణ్ ఆరోన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు ధృవీకరించింది.
వరుణ్ ఆరోన్ తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికి ఎక్కువ కాలం కాలేదు. అతను జనవరి 2025లో క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ జట్టు ఎలిమినేట్ అయిన తర్వాత అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.
వరుణ్ ఆరోన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారత్ తరపున 9 టెస్ట్ మ్యాచ్‌లు, 9 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అతను తన బౌలింగ్ వేగం కారణంగా ఎక్కువగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుణ్ విసిరిన అత్యంత వేగవంతమైన బంతి 152.5 కిమీ/గం వేగంతో ఉంది. ఈ రికార్డును అతను 2014లో శ్రీలంకతో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో సాధించాడు. అదే సమయంలో డొమెస్టిక్ క్రికెట్‌లో అతను 153 కిమీ/గం వేగంతో బంతిని విసిరాడు.
Also Read: Jadeja- Carse: కార్స్- జడేజా మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్!
A fiery addition to our coaching staff! Welcome Varun Aaron as our new bowling coach 🔥🧡#PlayWithFire pic.twitter.com/qeg1bWntC5
— SunRisers Hyderabad (@SunRisers) July 14, 2025
వరుణ్ ఆరోన్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత టీవీ కామెంటేటర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతను భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో కామెంటరీ చేస్తూ కనిపిస్తున్నాడు. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఎస్‌ఆర్‌హెచ్ జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం 6 విజయాలు మాత్రమే సాధించగలిగింది. దీని కారణంగా పాయింట్స్ టేబుల్‌లో ఆరవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వరుణ్ ఆరోన్ తన కెరీర్‌లో మొత్తం 52 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 50 ఇన్నింగ్స్‌లలో 44 వికెట్లు సాధించాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం. 2011లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరపున ఆడుతూ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. చివరిసారిగా 2022లో ఐపీఎల్‌లో కనిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను టెస్ట్ మ్యాచ్‌లలో 18 వికెట్లు, వన్డే మ్యాచ్‌లలో 11 వికెట్లు సాధించాడు.